మారిన సంధ్యారాగం | - | Sakshi
Sakshi News home page

మారిన సంధ్యారాగం

Published Sat, Aug 24 2024 1:32 PM | Last Updated on Sat, Aug 24 2024 1:32 PM

మారిన

24.08.2023: ‘నాలుగున్నరేళ్లుగా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వానికి ఎన్నికల ముందు గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందా? కూల్చడమే తప్ప కట్టడమే తెలియని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, చేసినవాటికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేయడమే తప్ప చేసిందేమీ లేదు. గిరిజనులు నివసించే జిల్లాను పక్కనపెట్టి మళ్లీ విజయనగరం జిల్లాలోనే నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మోసం కాదా? ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామాల నుంచి ఆంధ్రా అధికారులు గోబ్యాక్‌ అని నినాదాలు చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శంకుస్థాపన చేయిస్తారా? స్వగ్రామంలో పాఠశాల భవనం నిర్మించలేని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గిరిజన వర్సిటీ కట్టిస్తారా?’

– ఇదీ సరిగ్గా ఏడాది కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు

గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు

23.8.2024: ‘ఇది సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం. ఇక్కడ గిరిజన యూనివర్సిటీకి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పటికీ సరిపోతుందో లేదోనని కొన్ని అంచనాలు ఉండేవి. ఇక్కడి రైతులు 560 ఎకరాలు ఇచ్చారు. ఇది గిరిజన ప్రాంతానికి కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ పెడితే బాగుంటుందని చంద్రబాబు ఇక్కడే యూనివర్సిటీని కంటిన్యూ చేద్దామని చెప్పారు. ఇక్కడ భూమి కూడా చాలా బాగుంది. నేషనల్‌ హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గత ప్రభుత్వం వలే శిలాఫలకాలు వేసి వెళ్లిపోము’

– ఇదీ ఇప్పుడు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో

గుమ్మడి సంధ్యారాణి మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో

శుక్రవారం మీడియాతో చేసిన వ్యాఖ్యలు.

No comments yet. Be the first to comment!
Add a comment
మారిన సంధ్యారాగం 1
1/1

మారిన సంధ్యారాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement