రసాభాస | - | Sakshi
Sakshi News home page

రసాభాస

Published Sat, Aug 24 2024 1:32 PM | Last Updated on Sat, Aug 24 2024 1:32 PM

రసాభా

–8లో
కనీస అవసరాలు తీర్చుకునేందుకు కాసిన్ని మౌలిక సదుపాయాలు, అపాయాలు వచ్చినప్పుడు రక్షించేందుకు కొన్ని జాగ్రత్తలు, నిర్భయంగా పనిచేసేలా సురక్షిత పరిసరాలు, ఆస్పత్రికి వెళ్లి మళ్లీ భద్రంగా ఇంటికి తిరిగి వచ్చేలా భరోసా.. ఇంతే.. కావాల్సినవల్లా ఇవే. మహిళా వైద్యులు, ఆస్పత్రుల్లో పనిచేసే మహిళా వైద్య సిబ్బంది వీటి కోసమే ఎదురుచూస్తున్నారు. కోల్‌కతా వంటి సంఘటనలు మన వద్ద జరగకూడదంటే ఈ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరుతున్నారు. ప్రసంగాలకు, ప్రకటనలకు పరిమితం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణకు తీర్మానాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు జిల్లాలో రసాభాసగా మారాయి. పాచిపెంటలో తెలుగు తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం, తోపులాట జరగ్గా.. కురుపాంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ తమ వారి ఫొటోలు ఫ్లెక్సీల్లో లేవంటూ వేర్వేరుగా గ్రామసభలు నిర్వహించడం గమనార్హం. ఆయా గ్రామసభల నిర్వహణ తీరు ఇలా ఉంది.

నిధులున్నా.. నిర్మాణం కనం

గిరిజన గ్రామాల రోడ్ల నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

శనివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2024

ఇలాంటి ఘటనలు దారుణం

ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళలపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం. కోల్‌కత్తాలో జరిగిన ఘటన బాధాకరం. జిల్లాలోని మహిళా వైద్యుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి.

డాక్టర్‌. కె.శ్యామల,

ఆర్‌ఎంఓ, జిల్లా ఆస్పత్రి

నిందితులను

కఠినంగా శిక్షించాలి

వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కఠిన చట్టాలు అమలు చేయాలి. జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యసిబ్బందికి రక్షణ కల్పించాలి.

డాక్టర్‌.ఎం.శిరీష, వైద్యురాలు, పీహెచ్‌సీ

పాచిపెంటలో టీడీపీ వర్గవిభేదాలు కురుపాంలో ఫ్లెక్సీల గొడవ

పాచిపెంటలో

తమ్ముళ్ల తోపులాట

పాచిపెంట: టీడీపీలో వర్గవిభేదాలకు పాచిపెంటలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ వేదికై ంది. మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్‌ పాచిపెంట సంతోషి అధ్యక్షతన జరిగిన గ్రామసభ ప్రారంభం నుంచే రసాభాసగా సాగింది. సర్పంచ్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీడీపీ మండలాధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు సభలో మాట్లాడుతూ, పంచాయతీలో నిర్వహించిన అభివృద్ధి పనులు తన సొంత డబ్బుతో చేపట్టినట్లు చెప్పారు. ఈ విషయంపై అధికార టీడీపీకి చెందిన ఉపసర్పంచ్‌ పల్లేడ వెంకటరమణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ,గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన పనులను మీ సొంత డబ్బులతో చేసినట్లు మాట్లాడడం సరికాదని ఖండించారు. రెండున్నర సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించకుండా పంచాయతీ నిధులు ఎలా ఖర్చు చేశారని, వాటికి సంబంధించిన వివరాలు గ్రామసభసాక్షిగా తెలియచేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే గ్రామదేవత వారాల పండుగ పేరుతో, గ్రామపెద్దలకు కూడా తెలియకుండా గ్రామకంఠం డబ్బులు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు.

ప్రోటోకాల్‌ పాటించరా?

తాను కూడా అధికార పార్టీకి చెందిన వైస్‌సర్పంచ్‌ను అయినప్పటికీ ఈ గ్రామసభకు తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ పంచాయతీ కార్యదర్శిపై మండిపడ్డారు. ప్రోటోకాల్‌ విస్మరించి తనకు సమాచారం అందించకపోయినప్పటికీ, తాను సభకు హాజరయ్యానని, ఇదే సభలో అనధికార వ్యక్తులను వేదికపై కూర్చోబెట్టి, ప్రొటోకాల్‌ ఉన్న తనను వేదికమీదకు ఆహ్వానించలేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ప్రారంభమైన గొడవలు పిన్నింటి ప్రసాద్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా తారస్థాయికి చేరాయి. క్రమంగా ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి గొడవ మారింది. దీంతో ఏఎస్సై ముసలయ్య ఆధ్వర్యంలో పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇదంతా గమనించిన ప్రజలు, వీళ్ల సమస్యలే వీళ్లే తీర్చుకోలేరు కానీ మా సమస్యలు ఏం తీరుస్తారంటూ వ్యంగ్యంగా విమర్శిస్తూ సభనుంచి వెనుదిరగడం కనిపించింది.

కురుపాంలో వేర్వేరుగా గ్రామసభలు

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మేజర్‌ పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపు కోసం శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామసభకు కేటాయించిన సమయానికే హాజరైన సర్పంచ్‌ గార్ల సుజాత, పంచాయతీ కార్యదర్శి బి.అనిత అధ్యక్షతన సమావేశం ఉదయం ప్రారంభమైంది. ఈ సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గొర్లె సుజాత పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఫొటో లేదంటూ సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీలను ప్రశ్నించారు. దీనికి స్పందించిన సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ మాట్లాడుతూ సభ నిర్వహణ బాధ్యతలు ఉపాధి హామీ పథకం అధికారులవని, తమది కేవలం అధ్యక్ష బాధ్యతేనని తెలియజేశారు. అలాగే ఇదే సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అరకు ఎంపీ తనూజారాణి ఫొటో లేదని తామెవరిపైనా ఆరోపణలు చేశామని టీడీపీ నాయకులకు సమాధానమిచ్చారు. అలాగే అప్పటికే సర్పంచ్‌ ఆధ్వర్యంలో గుర్తించిన అభివృధ్ధి పనులను సభలో చదివి వినిపించారు. దీంతో ఆగని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ జీవీ రమణ మూర్తి అక్కడి మినిట్‌ బుక్‌ను చింపేయడం, టీడీపీ నాయకుడు సుఖేష్‌ చంద్ర పండా మహిళా ప్రజా ప్రతినిధులని చూడకుండా అగౌరవంగా మా టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించే సభలో మీకేం పనంటూ మాట్లాడడంతో ఇరువర్గాల మధ్య కాస్త తోపులాట జరగడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

టీడీపీ సభకు వైఎస్సార్‌సీపీ గైర్హాజరు

మధ్యాహ్నం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఫొటోలతో గ్రామసభ నిర్వహించగా, ఎంపీ తనూజా రాణి ఫొటో ఫ్లెక్సీలో లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు సభకు గైర్హజరయ్యారు. టీడీపీ వార్డు సభ్యులు చంటి, నాగరాజుల అధ్యక్షతన రెండో సారి గ్రామ సభ నిర్వహించి పలు అభివృధ్ధి పనులను ప్రతిపాదించారు. ఈ సభలో గ్రామసభ ప్రత్యేకాధికారి వెలుగు ఏపీఎం కిశోర్‌కుమార్‌ కూర్చునేందుకు కుర్చీ కూడా కేటాయించకపోవడం శోచనీయం. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ నిషార్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జిలానీ, ఎంపీటీసీ బంగారు నాయుడు, కూటమి నాయకులు కోలా రంజిత్‌ కుమార్‌, కేవీ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
రసాభాస1
1/5

రసాభాస

రసాభాస2
2/5

రసాభాస

రసాభాస3
3/5

రసాభాస

రసాభాస4
4/5

రసాభాస

రసాభాస5
5/5

రసాభాస

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement