చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్‌ జగన్‌ | YS Jagan Declare War Against Chandrababu Govt, Held Meeting With Party Leaders Over Action Plan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్‌ జగన్‌

Published Wed, Oct 2 2024 7:03 PM | Last Updated on Mon, Oct 7 2024 1:53 PM

YS Jagan Against Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు. 

‘‘విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేకపోయారు. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి. తమకు నచ్చినవారికి మాత్రమే ఇస్తున్నారు. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది. అందుకనే ప్రజలను డైవర్ట్‌ చేయడానికి కొత్త టాపిక్స్ తెర మీదకి తెస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇక నుంచి గట్టిగా యుద్ధం చేద్దాం’’ అని పార్టీ కేడర్‌కు పిలుపు ఇచ్చారాయన.

తిరోగమన ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవన్‌ లేదు. అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజల కోపంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం కుప్పకూలింది. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయి. మూడు నెలల్లో లక్షన్నర ఫించన్లు తగ్గించారు. జన్మభూమి కమిటీలు వచ్చాయి. చదువులు లేవు, వ్యవసాయానికి పెట్టుబడి సాయం, ఆర్బీకేలు, ఫ్రీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పోయాయి. ప్రభుత్వంలో రోల్‌ మోడల్‌లో నిలబడాల్సిన వ్యవసాయం, చదువులు, వైద్యం.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉంది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌
ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్‌ బుక్‌ పరిపాలన చేస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ లేదు. డోర్‌ డెలివరీ గాలికెగిరిపోయింది. పారదర్శకత లేదు. చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్ధితిలో ఉన్నారు. ప్రజలు కలెక్టర్‌ ఆఫీస్‌ను చుట్టుముడుతున్నారు. వాళ్లకు నచ్చిన కొందరికే పరిహారం ఇస్తున్నారు. నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత తారాస్ధాయికి వెళ్లడంతో, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. తిరుపతి లడ్డూ అని ఒకసారి, డిక్లరేషన్‌ అని మరోసారి డైవర్షన్‌ చేస్తున్నారు.  

దేవుడికే కోపం తెప్పిస్తున్నారు
వీళ్లు చేసే పనులకు దేవుడు కూడా కోపం వచ్చి అనూహ్య రీతిలో మొట్టికాయలు వేస్తున్నారు. అది కూడా దేవుని దయే. టీటీడీకి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అపాయింట్‌ అయిన ఐఏఎస్‌ ఆఫీసరే ఈఓగా ఉన్నారు. వాళ్ల ఈఓ చెప్పిన మాటలు.. చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలు అబద్దాలు అని తేలిపోయింది. నోటీసులు ఇవ్వలేదంటారు. అడ్డుకోలేదంటారు. ఇవిగో నోటీసులు అంటే మాట్లాడరు. ప్రభుత్వం వాళ్లు చేస్తున్న పనులతో దేవుడికి కూడా కోపం తెప్పిస్తున్నారు. చాలా అధ్వాన్నమైన పాలన చేస్తున్నారు అని జగన్‌ అన్నారు.

ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్‌ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement