గాంధీజీ ఆశయాలు అనుసరణీయం
పార్వతీపురం: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలు అనుసరణీయమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నా రు. మహత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గాంధీజీ ఆశయాలు దేశానికి ఆదర్శమన్నారు. గాంధీజీ బోధనలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారన్నారు. అహింసా సిద్ధాంతం విశవ్యాప్తంగా గొప్పమార్గాన్ని చూపిందని తెలిపారు. గాంధీజీ సత్యనిష్ట, సాధారణ జీవనం, నిజాయితీ గొప్ప వారసత్వ సంపదగా గ్రహించాలన్నారు. ఈ ప్రాంతంలో పొందూరు ఖాదీ పట్ల గాంధీజీ ఎంతో ఆకర్షితులయ్యారన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, కలెక్టర్ కార్యాలయ ఏఓ ఎం.సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ స్ఫూర్తితో కొత్త సంకల్పం
పార్వతీపురం టౌన్: గాంధీజీ స్ఫూర్తితో కొత్త సంకల్పం తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీజీ 155 జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతజాతికి మహాత్మా గాంధీజీ గొప్ప స్ఫూర్తి ప్రదాతగా పేర్కొన్నారు. దక్షిణ ఆఫ్రికాలో రైలు పెట్టె నుంచి బయట కు తోసివేసిన సంఘటన మహాత్మా గాంధీజీ జీవి తంలో గొప్ప మార్పును తీసుకువచ్చిందన్నారు. దక్షిణ ఆఫ్రికా వాసులు, అచ్చట ఉన్న భారతీయుల హక్కులను కాపాడేందుకు పోరాటం చేసి అనేక సదుపాయాలు వచ్చేలాచేశారన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీజీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారని, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ లాంటి ఉద్యమాలలో యావత్ దేశ ప్రజలలో స్వరాజ్య స్ఫూర్తిని రగిలించారని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో పోరాడి భార త దేశానికి స్వాతంత్య్రం వచ్చేలా కృషి చేశారన్నా రు. ఎన్నో ఉద్యమాలకు అహింసా మార్గంలో రూపకల్పన చేసి గొప్ప మార్గదర్శకత్వం వహించారని తెలియజేశారు.
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment