కొలువైన శివుడు
సోమవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2024
అందాల గుహలో..
ప్రపంచంలోనే
అతిపెద్ద నందివిగ్రహం
ఈ ఆలయ ప్రాంగణంలో 47 అడుగుల వెడల్పు, 42 అడుగుల ఎత్తు, 24 అడుగుల కై వారం గల అతి పెద్ద నంది విగ్రహాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్మించింది. దీని నిర్మాణంతో ఈ ప్రాంగణానికి కొత్త రూపు వచ్చింది. దీంతో భక్తులు తాకిడి కూడా పెరిగింది.
పార్వతీపురం టౌన్: శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో పార్వతీపురం జిల్లా కేంద్రానికి 4కిలోమీటర్ల దూరంలో అడ్డాపుశీలలో కొలువైన కాశీవిశ్వేశ్వరునికి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, రుద్రపూజలు విశేషంగా చేస్తారు. అడ్డాపుశీలలో కొలువైన కాశీవిశ్వేశ్వరుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సుప్రసిద్ధ దేవుడుగా పేరొందాడు. కార్తీక మాసంలో ప్రతీ సొమవారం ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. దేవాదాయశాఖ ఆదీనంలో ఉన్న ఈ ఆలయంలో కాశీవిశ్వేశ్వరుడు నిత్య అరాధన, పూజలను అందుకుటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో కాశీవిశ్వేశ్వరునితోపాటు మరో 12 ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ అభివృద్ధి దేవాదాయశాఖ చొరవతో మళ్లీ ఈ దేవాలయానికి కొత్త రూపువచ్చింది.
ఆలయానికి
ఇలా చేరుకోవాలి
జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలంటే పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాలకొండ, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కి అడ్డాపుశీల బస్టాప్ వద్ద దిగి అక్కడ నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. పార్వతీపురం నుంచి ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. పార్వతీపురం, పార్వతీపురం టౌన్ రైల్వేస్టేషన్‌లో దిగిన భక్తులు కూడా ఆటోల సహాయంతో గాని, బస్సుల్లో గాని చేరుకోవచ్చు.
వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు
న్యూస్‌రీల్
అడ్డాపుశీలలో ఆధ్యాత్మిక శోభ
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం నుంచి భక్తుల తాకిడి
Comments
Please login to add a commentAdd a comment