కదిలిన యంత్రాంగం
పాచిపెంట: మండలంలోని విశ్వనాథపురంలో డయేరియా అదుపులోకి రాలేదు. తాజాగా శనివారం మరో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరిని వైద్యం కోసం సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన 25 మంది డయేరియా బారిన పడడం, వీరిలో 9 మందిని మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించే అంశంపై ‘డయేరియాతో మంచం పట్టిన విశ్వనాథపురం’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు, పాలకులు స్పందించారు. సీ్త్ర శిశు సంక్షేమశాఖమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జేసీ శోభిత, ఇన్‌చార్జి డీపీఓ రామచంద్రరావు తదితరులు గ్రామాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలపై మంత్రి ఆరా తీశారు. పారిశుద్ధ్యపనులతో పాటు తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అదుపులోకి రాని డయేరియా
కొత్తగా మరో ఐదు కేసుల నమోదు
విశ్వనాథపురంను సందర్శించిన మంత్రి సంధ్యారాణి, జేసీ శోభిత
ఆందోళనలో గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment