43 మద్యం దుకాణాలకు 117 దరఖాస్తులు
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీకి ఇప్పటివరకు జిల్లాలో 117 దరఖాస్తులు అందాయని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శనివారం సీతానగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌ను సందర్శించి ఒక దరఖాస్తును స్వీకరించి, ప్రక్రియను పరిశీలించారన్నారు. జిల్లాలో 52 మద్యం షాపులకు దరఖాస్తులను కోరగా ఇప్పటివరకు 43 షాపులకు మాత్రమే దరఖాస్తుదారులు తమ దరఖాస్తులు సమర్పించారన్నారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు ప్రభుత్వం నిర్దేశించిన రూ.2 లక్షలు (నాన్ రిఫండబుల్ ) రుసుమును చెల్లించి తమ దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, సాలూరు, కురుపాం, పాలకొండ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వివరించారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రలోభాలను, పుకార్లను నమ్మవద్దు
జిల్లాలో నూతన మద్యం పాలసీ చాలా పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎటువంటి ప్రలోభాలను, పుకార్లను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను అక్టోబర్ 11వ తేదీన కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందని, డ్రాలో వచ్చిన దరఖాస్తుదారునికే షాపులను కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దరఖాస్తు దారులు గమనించి తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
ఆదివారం కూడా
దరఖాస్తులు స్వీకరిస్తాం
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన
స్పష్టం చేసిన
అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్
Comments
Please login to add a commentAdd a comment