సాయం అందించండి
పీసీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో రూ.2వేలు చొప్పున రూ.4వేలు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందజేయాల్సిన రూ.14వేలలో కనీసం ఒక్కరూపాయి కూడా అందించకపోవడం దారుణం. వ్యవసాయమంటేనే పెట్టుబడితో కూడినది. దీనిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే నిధులు విడుదల చేయాలి.
– వంగల ఈఽశ్వరరావు, రైతు, కందివలస గ్రామం, కొమరాడ మండలం
ఇంకా ఎన్నాళ్లకు?
ఖరీఫ్ పంట కాలం చివరి దశకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి పెట్టుబడి సాయం అందలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియడంలేదు. సాగుకు పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం. గత ప్రభుత్వ హయాంలో ఏటా వ్యవసాయ సీజన్ కంటే ముందుగా రైతు భరోసా నిధులు నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాలకు జమయ్యేవి.
– ఎస్.విజయ్‌కుమార్, కోటిపల్లి, రైతు
●
Comments
Please login to add a commentAdd a comment