శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

Published Fri, Oct 25 2024 1:51 AM | Last Updated on Fri, Oct 25 2024 1:50 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

IIలో

గుర్ల మండల కేంద్రంలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

డీఆర్వోగా రవీంద్రరావు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారిగా ఎ.రవీంద్రరావును నియ మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహించి వెయిటింగ్‌లో ఉన్న ఈయనను డీఆర్వోగా నియమించింది. ఇంతవరకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జి.కేశవనాయుడు డీఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. రవీంద్రరావు ఒక టి, రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

డీఈఓగా తిరుపతినాయుడు

పార్వతీపురం టౌన్‌: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎన్‌.తిరుపతినాయడును నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇప్పటి వరకు విజయనగ రం జిల్లా డైట్‌ కళాశాల సీనియర్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించిన జి. పగడాలమ్మను విజయనగరం జిల్లా డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నర్సింగ్‌ అసోసియేషన్‌

ఉపాధ్యక్షురాలిగా పద్మావతి

పార్వతీపురంటౌన్‌: ఉమ్మడి విజయనగరం జిల్లా గవర్నమెంట్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలిగా వి.పద్మావతి చంద్రసాయి ఎన్నికయ్యారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమెకు సూపరింటెండెంట్‌ బి.వాగ్దేవి, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు కిషోర్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, వైద్యులు, హెడ్‌ నర్సులు గురువారం అభినందనలు తెలిపారు.

టీచర్‌ ఓటు హక్కుకు

దరఖాస్తుల స్వీకరణ

వచ్చేనెల ఆరో తేదీ వరకు అవకాశం

విజయనగరం అర్బన్‌: శాసనమండలి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో ఓటుహక్కు పొందేందుకు నవంబర్‌ 6వ తేదీలోగా ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఈఆర్వో, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహనరావు తెలిపారు. దీనిపై అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో ఉపాధ్యాయు లకు అవగాహన కల్పించామన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో విజయనగరం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ తుదిగడువు నవంబర్‌ 6వ తేదీ అని చెప్పారు. నవంబర్‌ 23న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తామని, అభ్యంతరాల స్వీకరణ అనంత రం డిసెంబర్‌ 30న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. సమావేశంలో విజయనగరం జిల్లా డీఆర్వో ఎస్డి అనిత, మన్యం జిల్లా డీఆర్వో జి.కేశవనాయుడు, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కరరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓ ఎంఈవోలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, విద్యాశాఖ ల అధికారులు పాల్గొన్నారు.

వేటకు వెళ్లరాదు

భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు సంద్రంలో అలలు ఎగసిపడడంతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని మత్స్యశాఖ డీడీ నిర్మలా కుమారి గురువారం సూచించారు. తీర ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిందన్నారు. తీరప్రాంత గ్రామాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించామని, తుఫాన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మత్స్యకారులకు తెలియజేస్తామని చెప్పారు.

రాములోరి హుండీల ఆదాయం రూ.28 లక్షలు

నెల్లిమర్ల రూరల్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానం హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయంలో ఉన్న ధర్మ హుండీల నుంచి ఈ ఏడాది మే నెల నుంచి నేటివరకు రూ. 28,8,291లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. లెక్కింపు ప్రక్రియను విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈఓ ప్రసాదరావు పర్యవేక్షించారు.

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అంటే ప్రజలకు ఓ ధైర్యం. ఆపద సమయాన ఆదుకుంటారన్న నమ్మకం. ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తారన్న నిజం. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను, బాధితులను ఆయన పరామర్శించిన సమయంలో ఈ మాటలే వినిపించాయి. ఊరంతా ఇదే చర్చ సాగింది. మాకు మీరున్నారయ్యా.. ఆ భరోసా చాలు.. మీరు స్పందించేవరకు మా గ్రామంవైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారంటూ బాధిత కుటుంబాలు పేర్కొనగా.. అక్కడి యువత, అభిమానులు సీఎం.. సీఎం అంటూ తమ అభిమానం చాటుకున్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన వేళ ఆయన పెద్దమనసును, ఆదుకునే గుణాన్ని ఊరిపెద్దలు మెచ్చుకున్నారు.

చీపురుపల్లి/ విజయనగరం/నెల్లిమర్ల రూరల్‌/గుర్ల: డయేరియాతో పది రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గుర్ల ప్రాంత వాసులకు ఓ ధైర్యం వచ్చింది... ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రభుత్వం ఆదుకుంటుందో లేదోనని ఎదరు చూసిన బాధిత కుటుంబాలకు భరోసా లభించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బాధితులను పరామర్శకు వచ్చినప్పటికీ బాధిత కుటుంబాలకు లభించని ధైర్యం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన బాధిత కుటుంబాల్లో భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కనీసం ధైర్యం కల్పించలేని పరిస్థితుల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. డయేరియా కారణంగా మృతి చెందిన కుటుంబాలతో గురువారం మాట్లాడుతూ.. తాను ఉన్నానని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆదుకుంటానని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంతవరకు ఎవ్వరూ తమను పట్టించుకోలేదని, కనీసం ఎలా ఉన్నామో ఎవ్వరూ చూసిన పాపాన పోలేదని.. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి తమ కష్ట, సుఖాలు తెలుసుకుని, తమకు అండగా ఉంటామనడమే కాకుండా ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు రావడం తమకెంతో ధైర్యాన్ని ఇచ్చిందంటూ బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి.

బాధితులను పరామర్శించిన మాజీ సీఎం

గుర్ల మండల కేంద్రంతో పాటు కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లో డయేరియా కారణంగా మృతి చెందిన కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గుర్ల, కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లో డయేరియా కారణంగా 14 మంది మృతి చెందారు. వారి కుటుంబాలను గుర్ల మండల కేంద్రంలో ఆయన పరామర్శించారు. డయేరియా వ్యాధి వ్యాప్తికి కారణాలు, చికిత్స తీరు, ప్రభుత్వ సహకారం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

ఘన స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ నాయకులు

జిల్లాలోని గుర్లలో డయేరియా మృతులు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, తదితరులు ఘన స్వాగతం పలికారు. మండలంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌ పేట వద్ద ఉన్న దత్త ఎస్టేట్స్‌ ఆవరణలో ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.

అడుగడుగునా జన నీరాజనం

గుర్లలో డయేరియా మృతుల కుటుంబాల పరామర్శకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు జన నీరాజనం పట్టారు. దత్త ఎస్టేట్స్‌లోని హెలిప్యాడ్‌ నుంచి విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారి పైనుంచి గుర్ల మండల కేంద్రం వరకు 2.5 కిలోమీటర్లు మేర జగన్‌మోహన్‌రెడ్డి వాహనం వెంట సాగారు. అభిమానులంతా ముందుగా గుర్లకు చేరుకోవాలని జగన్‌ కోరినప్పటికీ వారంతా ఆయన వాహనాన్ని దగ్గరుండి ఊరేగింపుగా తీసుకొచ్చారు. దారిపొడవునా సీఎం.. సీఎం.. జగన్‌ అంటూ పెద్దఎత్తున నినదించారు. గుర్ల మండల కేంద్రంలో డయేరియా బాధిత కుటుంబాలను మాజీ సీఎం పరామర్శిస్తున్న సమయంతో పాటు ప్రెస్‌మీట్‌ జరుగుతున్న సమయంలో కూడా సీఎం.. సీఎం... అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినదించారు.

న్యూస్‌రీల్‌

ఆస్పత్రికి చేర్చేలోగా మృతి తోటపనికి వెళ్లి మృత్యు ఒడిలోకి.. కన్నీరుమున్నీరైన కుటుంబం

తరలివచ్చిన నాయకులు

గుర్లకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఆయనకు స్వాగతం పలికారు. వారిలో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కో ఆర్డినేటర్‌, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్‌ పెనుమత్స సురేష్‌ బాబు, నర్తు రామారావు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్ఫశ్రీవాణి, శాసన సభ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీలు బొత్స ఝాన్సీలక్ష్మి, బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కుమార్‌, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, రాజాం, టెక్కలి నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు తలే రాజేష్‌, పేరాడ తిలక్‌, పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, పార్టీ నాయకులు వేచలపు చినరామునాయుడు, నెక్కల నాయుడుబాబు, అందవరపు సూరిబాబు, పేడాడ రమణకుమారి, శోభా స్వాతిరాణి, శోభా హైమావతి, కేవీ సూర్యనారాయణరాజు, సముద్రపు రామారావు, తదితరులు ఉన్నారు.

జగన్‌ వచ్చారు.. భరోసా కల్పించారు..

డయేరియా బాధిత కుటుంబాలు, బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటన

ప్రజల్లో ధైర్యం నింపిన మాజీ సీఎం

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

14 మంది మృతుల కుటుంబాలను

కలిసి పరామర్శించిన మాజీ సీఎం

ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం అందజేస్తామని చెప్పిన జగన్‌

గుర్ల వచ్చిన మాజీ సీఎంకు ఘన స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ నేతలు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

గుర్లలో డయేరియా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తామని ప్రక టించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20241
1/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20242
2/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20243
3/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20244
4/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20245
5/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20246
6/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20247
7/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20248
8/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20249
9/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 202410
10/10

శుక్రవారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement