● మహిళల్లో పెరుగుతున్న రక్తహీనత ● జిల్లాలో 52,914 మంది
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఇటీవల కాలంలో బాలికలు, గర్భిణులు, సాధారణ మహిళల్లో కూడా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గర్భిణులైతే ప్రసవ సమయంలో రక్తం కోసం అవస్థలు పడుతున్నారు. అదే గ్రూపు రక్తం అందుబాటులో ఉంటే పరవాలేదు... లేదంటే ఇబ్బందులే.. బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. బాలికలు రక్తహీనత వల్ల రుతుస్రావం సమయంలో ఇబ్బంది పడుతున్నారు. రక్తహీనత వల్ల సాధారణ మహిళలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.
వేలాది మంది బాలికల్లో రక్తహీనత
జిల్లాలో వేలాది మంది బాలికల్లో రక్తహీనత ఉన్న ట్టు నిర్ధారణ అయింది. రక్తహీనత వల్ల బాలికలు అనారోగ్యం పాలవుతున్నారు. పలు ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికల్లో ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారు. బాలికల్లో రక్తహీనత అనేది ప్రధాన సమస్యగా మారింది.
కారణాలు ఇలా..
కడుపులోకి నులి పురుగులు చేరడం వల్ల అవి రక్తా న్ని పీల్చి తాగేయడం వల్ల రక్తహీనతకు గురవుతా రు. బహిరంగ మల విసర్జన వల్ల, చెప్పులు లేకుండా నడవడం వల్ల, మట్టిలో ఆడటం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని తాగేయడం వల్ల రక్తహీనత బారిన పడతారు. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కూడా రక్తహీనత బారిన పడతారు.
సగం మంది బాలికల్లో రక్తహీనత
జిల్లాలో 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు 53,856 మంది ఉన్నారు. వీరిలో 20,484 మంది బాలికలు బడిబయట ఉన్నారు. 52,914 మంది బాలికలకు వైద్య సిబ్బంది హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించా రు. ఇందులో 26,457 మందికి రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. రక్త పరీక్షల నిర్వహించిన వారిలో సగం మందికి రక్తహీనత ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
హెచ్‌బీ శాతాన్ని బట్టి చికిత్స
హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) శాతాన్ని బట్టి రక్తహీనత ఉన్న వారికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తారు. హెచ్‌బీ 7 గ్రాముల్లోపు ఉంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకి 2 చొప్పున అందిస్తారు. 8 నుంచి 11 గ్రాముల్లోపు ఉంటే రోజుకి ఒక మాత్ర చొప్పన అందిస్తారు. మాత్రలతో రక్తహీనత నివారణ కాదనుకుంటే ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్ ఎక్కిస్తారు. హెచ్ బీ నాలుగైదు గ్రాములు ఉన్న వారికి రక్తం ఎక్కిస్తారు.
చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు
రక్తహీనత వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడతా రు. ఇన్‌ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంది. రక్తహీనత వల్ల తరుచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, నిద్ర పట్టకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరు గుతుంది. ఛాతిలో నొప్పి, వేగంగా గుండె కొట్టుకో వడం, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, చిన్నచిన్న పనులకే నీరస పడడం జరుగుతుంది. చేసే పని పట్ల ఆసక్తి ఏకాగ్రత లేకపోవడం, నాలుక నొప్పి, చర్మం పాలిపోయినట్లు కనిపించడం జరుగుతుంది. రుతుచక్రంలో అసమానతలు రావడం జరుగుతుంది.
చర్యలు తీసుకుంటున్నాం..
బాలికలు, గర్భిణులు, సాధారణ మహిళల్లో రక్తహీనత నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటు న్నాం. పాఠశాలల్లో హెచ్‌బీ పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి రక్తం పెరిగేందుకు చర్య లు చేపడుతున్నాం. గర్భిణుల్లో హెచ్‌బీ నివారణకు ఐరన్ మాత్రలు అందిస్తున్నాం. సుక్రోజ్ ఇంజక్షన్లు ఎక్కిస్తున్నాం. ఇంకా అవసరమనుకుంటే ఆస్పత్రుల్లో చేర్పించి రక్తంఎక్కిస్తున్నాం.
– డాక్టర్ రాణి, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment