కలెక్టర్‌ను కలిసిన డీపీఓ
పార్వతీపురం: జిల్లా పంచాయతీ అధికారిగా టి.కొండలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసి, పంచాయతీలకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శవంతంగా నిలవాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. స్వచ్ఛసుందర పార్వతీపురంలో భాగంగా ప్రతి పంచాయతీలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. కొండలరావు అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీపీఓగా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు.
పౌరసరఫరాల గోదాం తనిఖీ
సీతంపేట: స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న పౌర సరఫరాల గోదాంను ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు, రికార్డులు పరిశీలించారు. రేషన్‌డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా అందివ్వాలని సిబ్బందికి సూచించారు.
వర్సిటీ అభివృద్ధే లక్ష్యం
● జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి వీసీ రాజ్యలక్ష్మి
విజయనగరం అర్బన్: యూనివర్సిటీ అభివృద్ధే లక్ష్యమని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీ పేరు ఇనుమడింపజేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. యూనివర్సిటీ సమావేశ మందిరంలో వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్నారు. ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని, ప్రతి విద్యార్థికి ఉజ్వల భవితను అందించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ సమష్టి కృషితో బాధ్యతగా పనిచేస్తే ప్రమాణాలతో కూడిన విద్యను అందించవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ప్రొఫెసర్ జాస్తి ఆనంద్ చందూలాల్, వర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన
పార్వతీపురం: మరుగుదొడ్ల వినియోగంపై ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10వ తేదీవరకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్, గృహనిర్మాణం, సూర్యఘర్ తదితర అంశాలపై అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు వినియోగంవల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. మరుగుదొడ్లను వినియోగించేవారికి బహుమతులు, ప్రశాంసా పత్రాలను అందించాలని సూచించారు. దీనికి జిల్లా పంచాయతీ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సౌరఘర్ పథకం కింద సౌరవిద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.చలపతిరావు, ఈఈ వేణుగోపాలనాయుడు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డుమా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి రామ్‌గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment