వినతులకు కచ్చితమైన పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులకు నాణ్యమైన, కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఏ రోజు వినతులు ఆ రోజే అధికారులు ఓపెన్ చేయాలని ఎక్కువగా రెవెన్యూకు చెందిన వినతులే వస్తున్నాయని తహసీల్దార్లు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావినతుల పరిష్కార వేదికలో భాగంగా ఈ మేరకు అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ సర్వే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్లు, శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ సెన్సస్ కూడా ఈ నెల నుంచే జరగాలని అందుకు అవసరమైన మాస్కర్ ట్రైనీలకు శిక్షణ కూడా పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 48 రీచ్‌లు అందుబాటులో ఉన్నాయని ప్రతి రీచ్‌కు ఒక గ్రామ కార్యదర్శిని ఇన్‌చార్జ్‌గా నియమించామని, ఉచిత ఇసుకను పొందడానికి కార్యదర్శి దగ్గర నుంచి పొందిన రసీదును తీసుకుని ఇసుకను పొందవచ్చని తెలిపారు. లోకాయుక్త కేసులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించుకోవాలని ఆయా అధికారులకు జేసీ సూచించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి అర్జీదారుల నుంచి మొత్తం 205 అర్జీలు స్వీకరించారు.
సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలి
విజయనగరం క్రైమ్: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 31 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్దగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని ఆదేశించారు. తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.లీలారావు, డీసీఆర్‌బీ ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జిలాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 156 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉప కరణాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ సందర్భంగా పలువురు దివ్యాంగులకు ఉపకరణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన టి.నర్సింహులు, గొర్లె వెంకటరావులకు వినికిడి యంత్రాలు, పార్వతీపురానికి చెందిన కె.మోహన్‌రావుకు మూడు చక్రాల సైకిల్‌ను అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment