విజయనగరం క్రైమ్: పోలీస్‌శిక్షణ కళాశాలలో పూర్తిస్థాయిలో శిక్షణ పొంది సర్వీసులో మంచి అధికారులుగా గుర్తింపు పొందాలని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌లకు రెండు వారాల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం పీటీసీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పీటీసీలో ఇచ్చిన శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాసిన్ అడిషనల్ డైరెక్టర్ జె.ఎం.కిశోర్ మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన వారితో పీటీసీలో ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వారి సర్వీసులో ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కరించిన తీరు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్రిమినల్ లా, 2023 గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. శిక్షణ కాలంలో అవుడోర్ శారీరక శిక్షణతో పాటు, ఆయుధాల మీద శిక్షణ, డ్రిల్, ఫైరింగ్ తదితర వాటిపై శిక్షణ ఉంటుందని చెప్పారు. పీటీసీలో ఽఉన్న అధునాతన డ్రైవింగ్ సిమిలేటర్, ఫైరింగ్ సిమిలేటర్‌పై శిక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో నాసిన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.గిరిధర్, వైస్ ప్రిన్సిపాల్ పీవీ.అప్పారావు, డీఏపీ టి.రమేష్, ఇండోర్, అవుట్‌డోర్ సిబ్బంది పాల్గొన్నారు.
పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు
Comments
Please login to add a commentAdd a comment