విజయనగరం క్రైమ్:
జిల్లాలోని ఎల్.కోట మండలం భీమాలిలో ఇటీవల కోడిపందాలను నిర్వహించిన వారిపై కేసు నమోదుచేయడంలో అలసత్వం ప్రదర్శించిన సంఘటనలో విచారణ కొనసాగుతుందని, అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరంగా కఠినచర్యలు తప్పవని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 27న ఎల్.కోట మండలం భీమాలి గ్రామశివార్లలో కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, వాహనాలు సీజ్ చేయడం, కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తనకు నివేదిక పంపించారన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఎల్.కోట పీఎస్‌లో అసిస్టెంట్ రైటర్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌పై తక్షణమే సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు వెల్లడైతే వారిపై కూడా క్రమశిక్షణ చర్యలతో పాటూ శాఖాపరమైన కఠినచర్యలు తీసుకుంటామని డీఐజీ స్పష్టం చేశారు.
డీఐజీ గోపీనాథ్ జెట్టి
Comments
Please login to add a commentAdd a comment