పది, ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: సార్వత్రిక విద్యాపీఠం 2024–25 విద్యా సంవత్సరానికి పదవతరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మంగళవారం నుంచి తత్కాల్ పద్ధతిలో అపరాధ రుసుము రూ.600తో ప్రవేశం పొందవచ్చునని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీ అని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఇన్/ఏపీ ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లించవచ్చాన్నారు. ఏమైనా సందేహాలుంటే ఓపెన్ స్కూల్స్ జిల్లా కో–ఆర్డినేటర్, ఎం. సుధాకర రావు, సెల్ 9848223413 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
20న జిల్లాస్థాయి క్రీడాపోటీలు
పార్వతీపురంటౌన్: గిరిజన విద్యార్థులకు ఈనెల 20న జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గయాజుద్దీన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురంలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించేందకు చర్యలు చేపట్టామని, ఈ పోటీలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలీబాల్, ఆర్చరీ, జావెలిన్ త్రో తో పాటు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏటీడబ్ల్యూఓ పరిధిలో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23 నుంచి 26 వరకు విశాఖపట్నంలో జరగనున్న జన జాతీయ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు తెలియజేశారు.
20న ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు
సీతంపేట: జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 20న ఐటీడీఏ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల క్లస్టర్ స్థాయిలో ఎంపికై న వారికి ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడలు విశాఖపట్నంలో ఉంటాయని పేర్కొన్నారు.
అంతర్ వర్సిటీ క్రాస్‌కంట్రీ పోటీలకు సీతం విద్యార్థి ఎంపిక
విజయనగరం అర్బన్: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలోని క్రాస్ కంట్రీ ఈవెంట్‌లో పదివేల మీటర్ల పోటీలకు పట్టణంలోని గాజులరేగ సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎం.సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహరాష్ట్రలోని నాందేడ్‌లో గల ఎస్‌ఆర్‌టీఎం యూనివర్సిటీలో జరిగే పోటీలకు జేఎన్‌టీయూ జీవీ జట్టు తరఫున యశ్వంత్ పాల్గొంటాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment