జాతీయ పోటీలకు జిల్లా బాక్సర్ల ఎంపిక
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన జిల్లా బాక్సింగ్ క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అభినందించారు. ఏయూ స్థాయిలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. 46–48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఎస్.తేజస్వి, 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత ఎ.సాయి, 52 కిలోల విభాగంలో రజత పతక విజేత ఎస్.కే.సుల్తానా, 93 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత జి.లిఖిత్ రెడ్డి జేసీని కలిసి వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని జేసీ అభినందిస్తూ జాతీయస్థాయిలో పంజాబ్‌లో డిసెంబర్ 26 నుంచి జరిగే అఖిల భారత విశ్వవిద్యాలయ బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, బాక్సింగ్ కోచ్ ఈశ్వరరావు పాల్గొన్నారు.
అభినందించిన జేసీ సేతు మాధవన్
Comments
Please login to add a commentAdd a comment