సీతంపేట: జీసీసీ ఎన్నికలకు సంబంధించి 3 నామినేషన్‌లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. మొత్తం 9 నామినేషన్‌లను అభ్యర్థులు దాఖలు చేయగా వివిధ కారణాల వల్ల బి.కృష్ణారావు, పి.ఆదినారాయణ, పి.సింహాచలంల నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరించామన్నారు. మిగతా ఆరుగురు సభ్యుల్లో చైర్మన్, వైస్‌చైర్మన్, నలుగురు బాడీ మెంబర్లను ఎన్నుకోనున్నట్లు చెప్పారు.
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని బూర్జవలస పోలీస్‌స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో నేరం నిరూపణ కావడంతో ముద్దాయి దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావుకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి మూడేళ్ల జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి చెందిన సైలాడ లక్ష్మణరావు 2021లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక వెంటపడి వేధింపులకు పాల్పడుతూ, కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడ్డాడని బూర్జవలస పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కె.రాజేష్ కేసు నమోదుచేశారు. ఆ కేసు దర్యాప్తు పూర్తయ్యాక నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో సకాలంలో సాక్షులను, ఆధారాలను న్యాయస్ధానంలో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తిచేసి ముద్దాయిని నిర్ధారించి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పోలీసుల తరఫున మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మావూరి శంకరరావు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment