పార్వతీపురంటౌన్: రాష్ట్రవిద్యాశాఖ అధికారుల తీరు ఉపాధ్యాయుల మీద కక్ష సాధించుకునే విధంగా ఉందని, అందువల్లనే అనవసరమైన విషయాల మీద చర్చకు తావిస్తూ ఉపాధ్యాయులను బలిపశువులుగా చేస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, బాలకృష్ణ్ణ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత పాఠశాలల పని వేళలు దశాబ్దాల నుంచి రోజుకు 7 గంటల చొప్పున శాసీ్త్రయంగా నిర్ణయించారన్నారు. విద్యార్థులు వారి ఇళ్ల వద్ద చదువుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుందని, ప్రస్తుతం విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల చదువు పట్ల నిజమైన అపేక్ష ఉంటే ఉపాధ్యాయులను పూర్తిగా బోధనేతర పనులనుంచి మినహాయించి విద్యార్థుల పట్ల వారి నిబద్ధతను, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలలో ఒకే శ్లాబ్‌లో ఇంటి అద్దె అలవెనన్స్ పొందుతున్న ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టడానికి జనాభా ప్రాతిపదికన బదిలీల్లో అసమానత్వాన్ని కలిగించడం అనాలోచిత నిర్ణయమన్నారు. ఇలాంటి అనవసరమైన గందరగోళానికి ఉపాధ్యాయులను గురి కానివ్వకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన
కార్యదర్శులు
Comments
Please login to add a commentAdd a comment