చిల్లంగి నెపంతో దాడి | - | Sakshi
Sakshi News home page

చిల్లంగి నెపంతో దాడి

Published Thu, Nov 21 2024 12:32 AM | Last Updated on Thu, Nov 21 2024 12:32 AM

చిల్లంగి నెపంతో దాడి

చిల్లంగి నెపంతో దాడి

రాజకీయ కక్ష అంటూ పోలీసులకు

బాధితుల ఫిర్యాదు

బొబ్బిలి: ‘నిత్యం కడుపునొప్పి వస్తోంది. నువ్వు రోజూ కలలో కనిపిస్తున్నావు. నువ్వే చిల్లంగి పెట్టిఉంటావు’’ అంటూ వైఎస్సార్‌సీపీ పంచాయతీ వార్డు మెంబర్‌ భర్తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్‌ అనుచరుడు దాడి చేశాడు. అంతే కాకుండా బాధితుడి భార్య వార్డు మెంబర్‌పైనా దూషణలకు దిగాడు. బొబ్బిలి మండలం కొండదేవుపల్లి గ్రామంలో రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఇన్నాళ్లూ గ్రామంలోనే ఉన్న వార్డు మెంబర్‌ భర్తపై లేనిపోని ఆరోపణలను టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలతో దాడులకు దిగడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ దాడిపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు చెప్పి భార్యాభర్తలిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై గ్రామ పెద్దలతో కలిసి బుధవారం బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లి మొరపెటుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. దీంతో శంబంగి పోలీసులకు ఫోన్‌చేసి ఇదేం సంప్రదాయం? ఇలాగేనా రాజకీయ కక్షలు తీర్చుకుంటారు. ఈ రోజుల్లో కూడా చిల్లంగి వంటి పాతనమ్మకాలను అడ్డంపెట్టుకుని రాజకీయకక్షలు సాధిస్తారా? ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దాడి వెనుక నేపథ్యం..!

కొండదేవుపల్లిలో పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలు వైఎస్సార్‌ సీపీ, టీడీపీకి సమానంగా వచ్చాయి. ఇందులో బొమ్మరిల్లు అప్పలనర్సమ్మ కూడా ఉన్నారు. వారిలో ఒకరు టీడీపీలోకి వస్తే ఉప సర్పంచ్‌ పదవి వస్తుందని అప్పలనర్సమ్మను టీడీపీ వారు ప్రలోభపెట్టారు. దీనికి ఆమె, ఆమె భర్త వ్యతిరేకించారు.మేం వైఎస్సార్‌సీపీకి మద్దతు దారులం. ఎప్పుడైనా పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు ఇలా కక్ష తీర్చుకుంటున్నారని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తెలియజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement