గిరిజన ఉత్పత్తులను గరిష్ట ధరకు విక్రయించాలి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన ఉత్పత్తులను గరిష్ట ధరకు విక్రయించాలని ఎంఎఫ్‌పీ సూపరింటెండెంట్ జి.అప్పారావు పేర్కొన్నారు. మండలంలోని బీరుపాడులో జీసీసీ గిరిజన ఉత్పత్తులపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు సంబంధించి విశాఖపట్నం జీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి గిరిజన ఉత్పత్తులపై కొత్త ధరలను ప్రకటించడం జరిగిందన్నారు. జీసీసీ నిర్ణయించిన ధరల కంటే తక్కువకు ఏ ఒక్క గిరిజనుడు ఉత్పత్తులను విక్రయించరాదన్నారు. కార్యక్రమంలో సేల్స్‌మేన్ జె.గోపాలరావు తదితరులున్నారు.
ఈతకు దిగిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తగరపువలస/గరివిడి: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో శుక్రవారం ఈతకు దిగిన ఇంజినీరింగ్ విద్యార్థి మీసాల నాని (20) మృతి చెందాడు. కొమ్మాది గాయత్రీ ఇంజినీరింగ్ కళాశాలలో అతను సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కందిపేటకు చెందిన నాని, ఆరుగురు స్నేహితులతో కలిసి సరదాగా రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగిన సమయంలో నాని రిజర్వాయర్‌లో మునిగిపోతుండటంతో, అతని స్నేహితులు కాపాడాలని కేకలు వేశారు. అక్కడే ఉన్న గ్రామస్తులు ప్రయత్నించినప్పటికీ, నాని మునిగిపోయి మృతి చెందాడు. ఆనందపురం పోలీసులు, తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది రిజర్వాయర్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ వాసునాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాని కొమ్మాదిలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయదారులు.
Comments
Please login to add a commentAdd a comment