గడ్డివాములు దగ్ధం
● 20 బస్తాలు ధాన్యం అగ్నికి ఆహుతి
● లబోదిబో మంటున్న రైతు
లక్కవరపుకోట: మండల కేంద్రంలోని పట్టాలమ్మతల్లి గుడి సమీపంలో గల సంఘం చిన్నారావుకు చెందిన గడ్డివాములు, 20 బస్తాల ధాన్యం శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో కాలిబూడిదయాయి. ఈ ప్రమాదానికి సంబందించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు రైతు చిన్నారావు తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో వరి పంట వేసి నూర్పు చేసి కళ్లంలో గడ్డిమేటలు వేశారు. అలాగే సమీప రైతు నుంచి నాలుగు ఎకరాల్లో గడ్డిని కొనుగోలు చేసి మొత్తంగా 8 ఎకరాల్లో గడ్డి మేట్లు వేశాడు. ఈ గడ్డి మేట్ల కింద 20 బస్తాల ధాన్యం నిల్వ చేశాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఎలా జరిగిందో ఏమో తెలియదు గాని గడ్డివాముల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.10 నిమిషాల వ్యవధిలో గడ్డివాములకు మొత్తం అగ్నికీలలు వ్యాప్తించాయి.దీంతో ఎస్.కోట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే గడ్డి, ధాన్యం పూర్తిగా కాలిబూడిడయాయి. దీంతో రైతు చిన్నారావు లబోదిబోమంటూ రోదించాడు. చిన్నారావుకు జరిగిన నష్టంపై అంచనా వేసి ఉన్నతాదికారులకు నివేదిస్తామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment