ప్రలోభాలకు గురికావద్దు
గోదావరిఖని(రామగుండం): ప్రలోభాలకు లోనై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఆర్, స్పెషల్‌పార్టీ, వివిధ విభాగాలు, హోంగార్డ్ సిబ్బందితో నిర్వహించిన దర్బార్‌కు హాజరై సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ నిబంధనలు అధిగమిస్తే భవిష్యత్తులో శాఖాపరమైన ఇబ్బందులు తప్పవన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో 494 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని, పోలీసుశాఖలో అంతర్భాగమన్నారు. అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. కొంతమంది వారి స్వలా భం కోసం ప్రలోభాలకు గురిచేస్తే యూనిఫాం సర్వీ స్‌లో ఉండి నిరసనలు చేయవద్దని పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే రిపోర్టు రూపంలో ఉన్నతాధికారులకు పంపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్‌రావు, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, శ్రీధర్, మల్లేశం, సంపత్, ఎస్‌ఐలు, సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment