48 గంటల్లో ధాన్యం డబ్బు చెల్లించాలి
పెద్దపల్లి రూరల్: కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోగా మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, సోమవారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు కేటాయించాలని ఆదేశించారు. రైతులకు రోజూ వాతావరణ శాఖ సూచనలు అందజేయాలని, అకాల వర్షం వల్ల పంట ఎక్కడ నష్టం కలగకుండా చూడాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం కోతలు ఉండడానికి వీలులేదని, ధాన్యం నాణ్యతను కొనుగోలు చేసే సమయంలోనే పరిశీలించాలని సూచించారు. అనంతరం మద్దతు ధరకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment