దేశ సేవకు సిద్ధం కావాలి
జ్యోతినగర్: విద్యార్థులు దేశ సేవకు సిద్ధం కావా లని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ ఫార్మేషన్ డేను పురస్కరించుకొని గురువారం ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలోని విశ్వభారతి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల్లో పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. 1950, నవంబర్ 7న దేశంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభమైందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరి సామాజిక సేవ చేయాలని సూచించారు. విద్యార్థులు టెంట్లు, గ్యాడ్జెట్స్‌ల నిర్మాణం చేసి చూపిస్తూ ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అతిథిగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా జనరల్ సెక్రటరీ సూర్యదేవర జ్యోతి పాల్గొని శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి రామగుండం మండలంలోని విద్యాధికారులు, విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ యాదగిరిగౌడ్, పాఠశాల హెచ్‌ఎం తిరుపతిగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సేవాభావంతో పని చేయాలి
మంథని: ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేయాలని డీఈవో మాధవి అన్నారు. మంథని మండలం చిల్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు నరసింహరావు తన తండ్రి సత్యనారాయణరావు జ్ఞాపకార్థం విద్యార్థులకు టై, బెల్ట్, ఐడీ కార్డులు అందజేశారు. అలాగే పాటశాల ఉపాధ్యాయిని బి.హరిప్రియ తన ఉద్యోగ విరమణ సందర్భంగా షూ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోటీ ప్రపంచంలో ఎలా రాణించాలో, అందుకు ఏ విధమైన మెలకువలు అవలంబించాలో మార్గదర్శనం చేశారు. ఎంఈవో లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
డీఈవో మాధవి
Comments
Please login to add a commentAdd a comment