కొనుగోళ్లలో సమస్యలుంటే చెప్పండి
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని, కొనుగోళ్ల సమయంలో ఏమైన ఇబ్బందులుంటే నాకు ఫోన్ చేస్తే సత్వరమే స్పందిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల, పెద్దబొంకూర్, కొత్తపల్లి, మూలసాల, భోజన్నపేట, మారెడుగొండ, గుర్రాంపల్లి, ముత్తారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. సన్న, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారని అన్నారు. సన్నరకం వడ్లకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం రూ.500బోనస్ అందిస్తోందన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, విండో చైర్మన్ నర్సింహరెడ్డి, పెగడ రమేశ్‌యాదవ్, రాజ్‌కుమార్, సతీశ్, సీఈవో మన్‌మోహన్, సురేశ్‌తో పాటు డైరెక్టర్లు నాయకులు పాల్గొన్నారు.
కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment