మరుపురాని..మరువలేని.. మధుర క్షణాలు..
జ్యోతినగర్(రామగుండం): సుమారు 25ఏళ్ల క్రితం ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుకున్న విద్యార్థు లు ఆదివారం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కలుసుకున్నా రు. తొలుత ప్రధానోపాధ్యాయుడు మాధరవేణ కొ మురయ్య, ఉపాధ్యాయులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు. ఆ తర్వాత విద్యార్థులు జ్ఞాపకాలు, ఆనాటి మధుర క్షణాలను నెమరువేసుకున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ ఆపదలో ఉన్న, సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలని తీర్మానించారు. ఆటాపాటలతో సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, రాజు, ప్రకాశ్, కిషన్, అశోక్, శ్రీధర్, పూర్వ విద్యార్థులు నాగమల్లేశ్వరి, లక్ష్మి, శైలజ, కవిత, దుర్గ, సుమలత, మంగ, శారద, సరళ, వసంత, నగేశ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
55ఏళ్ల తర్వాత..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల ప్రభుత్వ హైస్కూలులో 1969 నుంచి 1979 వరకు పదో తరగతి చదివిన 35మంది విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తొలుత గురువులు జనార్దన్‌రావు, విద్యాసాగర్, చంద్రరెడ్డి, భూమయ్యను శాలువాలతో సన్మానించారు. పూర్వ విద్యార్థులు బొడకుంట కుమారస్వామి, సూత్రాల రాజేశం, గంగిశేట్టి రాజన్న, గొట్టెముక్కుల చంద్రమౌళి, రాంకిషన్‌రాజు, తాటికొండ రామన్న, గొర్ల మొండయ్య, ముక్క కిషన్, దండు కృష్ణారెడ్డి, ఎల్,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment