వర్ష జ్యువెలర్స్ ప్రారంభం
కరీంనగర్: 23 ఏళ్ల అనుభవంతో నగరంలోని టవర్ సర్కిల్‌లో ఎలగందుల వీరేశం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వర్షా జ్యువెల్లర్స్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ సంజయ్ ఆదివారం ప్రారంభించారు. కిలో వెండి కొనుగోలు పై 20 గ్రాముల వెండి కాయిన్, 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 10గ్రాముల వెండి ఉచితంగా అందిస్తున్నామని, ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమేనని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, కరీంనగర్, రామగుండం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మక్కాన్‌సింగ్ ఠాకూర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఆరెపల్లి మోహన్, నాయకులు చల్ల హరిశంకర్, నిర్వాహకులు ఎలగందుల వీరేశం, పెద్ది వేణుగోపాల్, బొడ్ల రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవ సభ మళ్లీ వాయిదా
మంథని: పట్టణంలో సోమవారం జరుగాల్సి న ప్రజాపాలన విజయోత్సవ సభ మరోమా రు ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. తొ లుత ఈనెల 24వ తేదీన సభ నిర్వహించా లని ఖరారు చేశారు. అనివార్య కారణాలతో ఈనెల 25కు ఆ తర్వాత ఈనెల 26 వాయిదా పడినట్లు జిల్లా ఇన్‌చార్జి పౌర సంబంధాల అధికారి జగన్ ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment