జల్సాల కోసం చోరీలు
గోదావరిఖని: జల్సాల కోసం చోరీలు చేస్తూ ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక రమేశ్‌నగర్‌కు చెందిన ఐత వెంకటేశ్(27) అనే నిందితున్ని చోరీ కేసులో అరెస్ట్ చేశారు. గోదావరిఖనిలో కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ తాగుడుకు బానిసై డబ్బుల కోసం అప్పు లు చేస్తుంటాడు. చేసిన అప్పు లు తీర్చేందుకు దొంగతనాలు చేస్తుంటా డు. కారు నడుపుతు న్న సమయంలో మఽ ద్యాహ్నం వేళల్లో తా ళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రి సమ యాల్లో ఇంట్లోకి చొర బడి బంగారు, వెండి ఆభరణాలు, డబ్బు లు, ఇతర వస్తువులు చోరీ చేస్తాడు. చోరీ సొత్తును అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 14న స్థానిక ద్వా రకానగర్‌లోని చిలకపల్లి రమేశ్ అనే సింగరేణి ఉ ద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి 4 తులాల బంగారం, 30 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితున్ని పట్టుకున్నారు. బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమో దు చేసి జైలుకు పంపారు. రెండు బంగారు బ్రాస్ లెట్లు, జత వెండి పట్టీలు, రెండు జతల కడియాలు, రెండు వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై భూమే్‌శ్, క్రైం టీమ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, వెంకటేశ్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment