పల్లెల్లో వందశాతం సర్వే
పెద్దపల్లిరూరల్: ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన కు టుంబ వివరాలను సర్వే ఫారంలో కలెక్టర్ స్వ యంగా రాశారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం(ఈనెల 24నాటికి) 99శాతం సర్వే పూర్తయింద ని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2,46,167 నివాసాల సర్వే పూర్తయిందన్నారు. పల్లెల్లో 1,64, 857 ఇళ్లు, (నూరు శాతం) పట్టణాల్లో 81,310 ఇళ్ల(97.37శాతం) సర్వే పూర్తయిందని ఆయన వివరించారు. పెండింగ్‌లోని ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నూరుశాతం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
నేడు మంత్రి ‘కొండా’ రాక
పెద్దపల్లిరూరల్: మంత్రి కొండా సురేఖ మంగళవారం సబ్బితంలో పర్యటించనున్నారు. శ్రీకోదండ రామాలయ అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే విజయరమణారా వు తెలిపారు. మంథనిలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గం
పెద్దపల్లిరూరల్: కబడ్డీ అసో సియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఖరారు చేశారు. జిల్లా చైర్మన్‌గా ఎమ్మెల్యే విజయరమణారావు వ్యవహరిస్తారని ఎన్నికల పరిశీలకులు మల్లేశ్, తిరుపతి, సంపత్‌రావు తెలిపారు. అ సోసియేషన్ అధ్యక్షుడిగా దేవసాని ధర్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తోట శంకర్, ఉపాధ్యక్షులుగా బి.రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, కార్యదర్శిగా కరుణాకర్, జాయింట్ సెక్రటరీగా షఫీ, సలహాదారుగా వైద కిష్టయ్యను ఖరారు చేశారు.
సకాలంలో విధులకు రావాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): వైద్యసిబ్బంది విధు లకు సకాలంలో హాజరు కావాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలే సర్కారు ఆస్పత్రులకు వస్తారని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కొందరు ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావడం లేదని, ఇది సరికాదని తప్పు పట్టారు. డాక్టర్ రమాదేవి పాల్గొన్నారు.
సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం
గోదావరిఖని: ఎలక్ట్రిక్ డిటోనేటర్ల స్థానంలో ఇ కనుంచి సింగరేణిలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వి నియోగించనున్నట్లు ఎక్స్‌ప్లోజివ్ జీఎం భైద్యా తెలిపారు. ఓసీపీలు, భూగర్భగనుల్లోని ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలతో ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. త యారీ కంపెనీలు ప్రీమియర్, సోలార్, ఐఆర్‌పీ సీ, డెల్‌టెక్స్, స్ట్రానే్, ఐడియల్, ఆర్‌ఐఎఫ్, వి ష్ణు తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పాతవాటి స్థానంలో ఎలక్ట్రానిక్ డిటోనేట ర్లను ఇప్పటకిఏ ఓసీపీల్లో వినియోగిస్తున్నామ ని తెలిపారు. డీజీఎం అనుమతి రాగానే భూగ ర్భ గనుల్లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
నేడు మహాహారతి
గోదావరిఖని: నగరంలోని సమ్మక్క – సారలమ్మ గద్దెల సమీపంలోని పుష్కరఘాట్‌లో మంగళవారం చేపట్టే గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ క్యాతం వెంకటరమణ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్లుగా కార్తీక మాసంలో మహాహారతి నిర్వహస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మహాహారతి చేపట్టామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment