సీఎం సభకు స్థల పరిశీలన
● 4న పెద్దపల్లికి రేవంత్‌రెడ్డి
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 4న జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం హాజరువుతారు. సీఎం పాల్గొనే సభాస్థలి కోసం కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి సోమవారం స్థల పరిశీలన చేశారు. పెద్దకల్వల(కలెక్టరేట్ ఎదుటి ఖాళీ ప్రదేశం)లోని ప్రాంతంతోపాటు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఉద్యోగ నియామకపత్రాల అందజేత
డిసెంబర్ 1 – 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవ సభలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఇందులో భాగంగా గ్రూపు–4, ఇతర పోటీపరీక్షల్లో ఎంపికై న 9 వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పెద్దపల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి అందజేస్తారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సభకోసం అనువైన స్థలాన్ని నిర్ణయిస్తామన్నారు. ఆయన వెంట ఆ ర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై ఆరా
పెద్దకల్వల సహకార సంఘం చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment