పల్లెనిద్రతో సమస్యలు పరిష్కారం
ఓదెల(పెద్దపల్లి): పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సీపీ ఆకస్మికంగా తనిఖీచేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని అన్నారు. ఇందుకోసం అసాంఘిక శక్తులు, అనుమానితులు, రౌడీషీటర్ల ప్రవర్తనపై నిఘా వేయాలని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఠాణాకు వచ్చేవ ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీగా ఉండాలని పేర్కొన్నారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment