గోదావరిఖని: కాళేశ్వరం జోన్ పరిధిలో ఐదు గురు ఎస్సైలను బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐ జీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. టి.ఉదయ్‌కిరణ్ వీఆర్, రామగుండం నుంచి ఎస్‌హెచ్‌వో, ఎన్టీపీసీకి, కె.సతీశ్ ఎస్‌హెచ్‌వో, ఎన్టీపీసీ నుంచి వీఆర్, రామగుండానికి, కె.వెంకటేశ్వర్రావు వీఆర్, రామగుండం నుంచి ఎస్సై–2, చెన్నూర్‌కు, సీహెచ్ సనత్కు మార్ మంచిర్యాల నుంచి ఎస్‌హెచ్‌వో, జూలపల్లికి, ఎన్.శ్రీధర్ ఎస్‌హెచ్‌వో, జూలపల్లి నుంచి సీసీఎస్, పెద్దపల్లికి బదిలీ అయ్యారు.
జాతర ఆదాయం రూ.14.80 లక్షలు
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ఆదాయం రూ. 14,80,482 స మకూరిందని ఈవో శంకరయ్య సోమవారం తె లిపారు. హుండీ ద్వారా రూ.6,51,126, వేలం ద్వారా రూ. 5,37,700, సేవా టికెట్ల ద్వారా రూ.2,52,006, తైబజార్ ద్వారా రూ.38,650 సమకూరిందని వివరించారు. అలాగే 570 గ్రాముల వెండి, 480 మిల్లీ గ్రాముల బంగారం భక్తులు కట్న, కానుకల రూపంలో సమర్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment