March 4th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 4th Updates | Sakshi
Sakshi News home page

AP Political Updates Mar 4th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Mon, Mar 4 2024 7:00 AM | Last Updated on Mon, Mar 4 2024 7:35 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 4th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu.. 

7:20 PM, Mar 4th, 2024

నర్సీపట్నం:

నారా లోకేష్‌కు షాక్‌ ఇచ్చిన ఆర్‌పి అగ్రహారం గ్రామస్తులు

  • పది రోజుల క్రితం నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిక
  • టీడీపీలో చేరిన కార్యకర్తలు తిరిగి ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
  • కుటుంబ కలహాలతో టీడీపీలో చేరాం: ఆర్‌పి అగ్రహారం గ్రామస్తులు
  • జగన్నన్న ఆధ్వర్యంలో రాష్టం సుభిక్షంగా ఉంది
  • రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ మరొకసారి సీఎంగా గెలవాలి

6:36 PM, Mar 4th, 2024

రాజమండ్రి:

టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్‌ ఫైర్‌

  • వాలంటీర్లను బెదిరిస్తున్న ఆదిరెడ్డికి వార్నింగ్‌ ఇచ్చిన భరత్‌
  • వాలంటీర్లను బెదిరిస్తే చెప్పుతో కొడతా
  • బ్లేడ్‌, గంజాయా బ్యాచ్‌లను పెంచి పోషించేది ఆదిరెడ్డి వర్గమే

6:30 PM, Mar 4th, 2024

తూర్పుగోదావరి జిల్లా: 

 రాజమండ్రిలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎన్నికల లోపు కచ్చితంగా ఇస్తాం: పేర్ని నాని 

  • రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్లను బెదిరించాడు
  • ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తే ఊరుకునేది లేదంటూ మాట్లాడిన ఆడియోను సిద్ధం సభలో ప్రజలకు వినిపించిన ఎంపీ భరత్
  • దేశంలో రాజకీయాలను మారుస్తూ కార్యకర్తలకు విలువ ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్..
  • ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్‌లు జరిగాయి.. కార్యకర్తలు మాకు వద్దు.. నాయకులను మార్చమంటే మార్చాడు
  • 2019కి ముందు అనేక హామీలు ఇచ్చి... హామీ పత్రాలు కూడా చంద్రబాబు ఇచ్చాడు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు
  • గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కొడుక్కి మినహా ఎవరికి జాబు రాలేదు

6:25 PM, Mar 4th, 2024

విజయవాడ

వాంబే కాలనీ లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ కార్యక్రమం
లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

  • సెంట్రల్ నియోజకవర్గంలో 21488 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది
  • అమరావతిలో 8500 ఇళ్ల కేటాయించడం జరిగింది
  • 14 వేల 886 నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి
  • 3342 ఇల్లు నిర్మాణం పూర్తి సిద్ధంగా ఉన్నాయి
  • కొద్దిరోజుల్లో మిగతా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం
  • అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్ కె దక్కింది
  • చంద్రబాబు జీవితంలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు
  • మిగతా ఇళ్లన్నీ పూర్తి అవ్వాలంటే మరల సీఎం జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి
  • ఎంతమందికి మా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం

6:20 PM, Mar 4th, 2024

విశాఖ:

రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్‌లో పర్యటన చేస్తున్నారు: గుడివాడ అమర్నాథ్ 

  • విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం
  • ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది  ప్రముఖులు హాజరవుతారు..
  • ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు
  • విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన
  • ఈస్ట్ కోస్గ్‌గా గేట్ వేగా వైజాగ్‌ను చూడలనేది సీఎం ఉద్దేశ్యం
  • విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారు
  • గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారు
  • విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్ ను సీఎం జగన్ విడుదల చేస్తారు
  • 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు
  • 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్ కు శంకుస్థాపన చేయనున్నారు
  • 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు
  • 7 తేదీన అనకాపల్లిలో ఆసరా 4 విడత కార్యక్రమంను  ప్రారంభిస్తారు
  • సచివాలయం తాకట్టు అనేది అవాస్తవం
  • ప్రజలను మభ్యపెట్టే విధంగా రాతల రాస్తున్నారు
  • తప్పుడు వార్తలు మీద  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు పిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నాము
  • ఎల్లో మీడియా రాసిన ప్రతి తప్పుడు వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • అభివృద్ధిని అడ్డుకోవాలని 600  తప్పుడు కేసులు వేశారు
  • వైజాగ్ గ్రోత్ ఇంజన్‌గా  రాష్ట్రానికి ఉంటుంది

6:15 PM, Mar 4th, 2024

ఎన్టీఆర్ జిల్లా: 

చిట్టేల లాంటి చిన్న గ్రామంలో 36 మంది వైఎస్సార్‌సీపీలో చేరారంటే టీడీపీ ఖాళీ అయినట్లే: ఎంపీ కేశినేని నాని

  • చంద్రబాబు పచ్చి మోసగాడు.. డ్వాక్రా,రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు 
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అన్ని వర్గాలు బాగుండాలంటే మళ్లీ జగన్నే గెలిపించుకోవాలి
  • తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్‌కుకేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్
  • అమరావతి ఉద్యమం పేరిట హైదరాబాద్ నుంచి ఒకతను వచ్చాడు
  • అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను
  • అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు
  • అదే హోటల్ వారిని చందాలు అడిగేవాడు అతని అరాచకాలు అలాంటివి
  • చంద్రబాబుకు తిరువూరు అంటే చాలా కోపం
  • ఇక్కడ టీడీపీలో ఆలీ బాబా 40 చోర్ లు ఉన్నారు
  • ఎందుకంటే వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాలి కాబట్టి
  • ఆలీబాబా 40 దొంగలను మించిన పెద్ద దొంగని తిరువూరు పంపించాడు చంద్రబాబు
  • అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి
  • మమ్మల్నీ డబ్బులు అడుగుతున్నాడేంటీ అని నన్ను అడుగుతున్నారు
  • స్వామిదాస్ మీద కొలికపూడి కామెంట్ చేశాడట
  • ఎవరితోనైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెబితే నేను,స్వామిదాస్ ఇద్దరం పోటి నుండి విరమిస్తాం

5:04 PM, Mar 4th, 2024

ఎన్టీఆర్ జిల్లా :

  • తిరువూరు మండలం చిట్టెల గ్రామంలో టీడీపీ నుండి వైఎస్సార్‌సీపీలో చేరిన 18 కుటుంబాలు
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇంచార్జ్‌ నల్లగట్ల స్వామిదాస్

4:15 PM, Mar 4th, 2024

విశాఖపట్నం

మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్సీ రవీంద్ర

  • ముస్సోరిలో సివిల్స్ శిక్షణా కేంద్రంలో కూడా ఇన్ని సదుపాయాలు లేవు
  • వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది
  • కోవిడ్‌ సమయంలో వైద్యం అందించడంలో ఖర్చుకు వెనుకాడని నాయకుడు సీఎం జగన్‌
     

2:55 PM, Mar 4th, 2024

విజయవాడ

ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్

  • ప్రశాంత్ కిషోర్‌కి ఆంధ్రాలో టీమ్‌ ఉందా?
  • అతను సర్వేలు ఎప్పుడు చేసాడు 
  • ఐ ప్యాక్‌కి, ప్రశాంత్‌ కిషోర్‌కి సంబంధం లేదు
  • ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు 
  • ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది 
  • ప్రశాంత్ కిషోర్‌ని ఎవరూ పట్టించుకోరు 
  • చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు 
  • టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నాడు 
  • ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు 
  • జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 
  • వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం

2:52 PM, Mar 4th, 2024

విశాఖ:

విశాఖలో ప్రలోభాల పర్వానికి తెర లేపిన టీడీపీ

  • భీమిలి నియోజకవర్గంలో బట్టలు పసుపు కుంకుమ పంపిణీకి సిద్ధం
  • పంచేందుకు లక్ష కిట్లను రెడీ చేసిన మాజీ మంత్రి గంటా
  • భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా
  • చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాను ఆదేశించిన చంద్రబాబు
  • అధినేత మాటను లెక్క చేయని గంటా

2:50 PM, Mar 4th, 2024

శ్రీసత్యసాయి జిల్లా:

సూరీ వర్సెస్‌ పరిటాల.. ధర్మవరంలో బయటపడ్డ టీడీపీ నేతల విబేధాలు

  •  ధర్మవరం నియోజకవర్గంలో తీవ్ర స్థాయికి చేరిన టీడీపీ నేతల విబేధాలు
  • మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ వర్సెస్ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్
  • బత్తలపల్లిలో వరదాపురం సూరీ వర్గీయుల వాహనాలు ధ్వంసం చేసిన పరిటాల అనుచరులు
  • పరిటాల - సూరీ వర్గీయుల రాళ్ల దాడులు
  • వరదాపురం సూరీ వర్గీయులు ప్రయాణిస్తున్న 10 వాహనాలు ధ్వంసం
  • నలుగురు వరదాపురం సూరీ వర్గీయులకు గాయాలు
  • పెనుకొండలో సాయంత్రం జరిగే చంద్రబాబు రా.. కదలిరా.. సమావేశానికి వెళ్తుండగా ఘటన
  • ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరీ వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ దాడికి పాల్పడిన పరిటాల శ్రీరామ్ వర్గీయులు
  • ధర్మవరం టికెట్ కోసం కొంతకాలంగా గొడవపడుతున్న పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరీ

2:41PM, Mar 4th, 2024

శ్రీసత్యసాయి జిల్లా:

పెనుకొండలో చంద్రబాబు రా.. కదలిరా సభ సందర్భంగా టీడీపీ నేతల ప్రలోభాలు 

:

  • జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
  • లేపాక్షి మండలం మైదుగోళం వద్ద ఇద్దరు టీడీపీ నేతల అరెస్టు
  • 4608 కర్నాటక మద్యం బాటిళ్లు స్వాధీనం
  • కర్నాటక నుంచి పెనుకొండకు మద్యం తీసుకెళ్తుండగా టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • టీడీపీ నేతలు హుస్సేన్, మాంతేష్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • పారిపోయిన మరో ఇద్దరు నేతలు

2:25 PM, Mar 4th, 2024

తూర్పుగోదావరి జిల్లా:

ప్రతిపక్షాలకు ఓ ఎజెండా అంటూ ఏమీ లేదు: హోంమంత్రి తానేటి వనిత

  • 2024లో సీఎం జగన్ సింగిల్‌గా పోటీ చేస్తుంటే ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నారు
  • ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై స్పందించడం లేదు
  • ప్రజలకు ఏం మంచి చేస్తామో చెప్పడం లేదు 
  • మొన్నటి వరకు సంక్షేమ పథకాలతో అప్పుల పాలవుతుందని ప్రచారం చేశారు 
  • ఇప్పుడు సీఎం జగన్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని ప్రతిపక్ష పార్టీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది 
  • వారికి  ఓ ఎజెండా లేదు
  • పక్క వాళ్ళ ఏజెండాను కాపీ కొట్టడమే ప్రతిపక్షాల పని

1:35 PM, Mar 4th, 2024
బాబుకు షాకిచ్చిన నేతలు.. 

  • పెనమలూరు టిక్కెట్‌పై ఎటూ తేల్చని చంద్రబాబు 
  • రోజుకో పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు 
  • తాజాగా పెనమలూరులో తెరపైకి ఎం.ఎస్.బేగ్ పేరు
  • ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయిస్తున్న టీడీపీ 
  • సర్వేపై మండిపడుతున్న పెనమలూరు టీడీపీ మైనార్టీ నేతలు
  • టీడీపీ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్
  • పెనమలూరు టిక్కెట్ ప్రకటించకుండా చంద్రబాబు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు 
  • మొదటి జాబితాలో బోడె ప్రసాద్‌కు సీటు ప్రకటిస్తారని ఆశించాం
  • బోడె ప్రసాద్‌కి సీటు ఇవ్వకుంటే మైనారిటీ అభ్యర్థిగా నాకు కేటాయించాలి
  • వలస వచ్చే వారికి మేము సహకరించే ప్రసక్తే లేదు. 
  • స్థానికులకే సీటు ప్రకటించాలి.
  • పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించడం లేదు
  • వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఏడుగురు మైనార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
  • చంద్రబాబు ఒక మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు
  • రెండో మైనార్టీ అభ్యర్థిగా నా పేరు చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. 

1:15 PM, Mar 4th, 2024
పీకేపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..

  • పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్‌ రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు
  • అంతా కలిసి ముప్పేట దాడి చేస్తున్నారు
  • ప్రశాంత్ కిషోర్ వంటి వారితో మాట్లాడిస్తున్నారు
  • బీహార్ నుంచి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు 
  • తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పీకే అంచనా తప్పింది

12:43 PM, Mar 4th, 2024
కృష్ణాజిల్లా:
సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్

  • సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడు
  • నేడు రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే
  • ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా
  • ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే
  • సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే
  • ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా?
  • ప్రజల అవసరాల కోసం... ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది
  • చిల్లర రాజకీయ నాయకుడు... చంద్రబాబు చేస్తేనే సంసారం

12:00 PM, Mar 4th, 2024
విజయవాడ
ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా మేము పరిగణించట్లేదు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 

  • సీఎం జగన్ పేద ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు
  • చంద్రబాబు తప్పుడు పేపర్లు కోర్టులో సబ్మిట్ చేసి దుర్మార్గానికి పాల్పడ్డాడు
  • కచ్చితంగా న్యాయపోరాటం చేసి పేదలకు ఇల్లు కట్టిస్తాం
  • పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు
  • నేటి రాజకీయ విశ్లేషణలకు ప్రశాంత్ కిషోర్ పనికిరాడు
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి అవగాహన లేదు
  • నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి మంతనాలు జరిపాడు
  • చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ కలసి ఉన్నారు
  • చంద్రబాబు ప్యాకేజీ కింద ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు
  • ఆంధ్రప్రదేశ్ వాస్తవ సంగతులు ప్రశాంత్ కిషోర్కి తెలియదు
  • ఇద్దరు పీకేలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పీకేది ఏం లేదు
  • పవన్ కళ్యాణ్ ఒక పీకే.. ప్రశాంత్ కిషోర్ ఒక పీకే
  • ఇలాంటి వారి గురించి ఆలోచించే పరిస్థితి సీఎం జగన్కి లేదు
  • ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారు

11:30 AM, Mar 4th, 2024
చిత్తూరు
చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్లు

  • చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసింది
  • ఆ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి
  • ఆయన్ని పార్టీ నుండి ఇప్పటికే సస్పెండ్ చేశాం
  • డిస్క్వాలిఫికేషన్కు అవకాశం ఉంటే అదికూడా పరిశీలిస్తాం
  • తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరం

11:00 AM, Mar 4th, 2024
పీకే వ్యాఖ్యలకు రాచమల్లు కౌంటర్‌

  • పీకే వ్యాఖ్యలపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
  • పీకే ఒక వ్యక్తి.. జనం కాదు.. వ్యూహకర్త..
  • అతను ప్రజల్లో తిరిగి సమస్యలు పరిష్కరించేవాడు కాదు
  • అలాంటి వ్యక్తి టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని మాట్లాడటం కరెక్ట్ కాదు
  • ఇదే పీకే 15 రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని చెప్పాడు
  • సర్వేలంటే శాస్త్రీయత ఉంటుంది
  • కానీ పీకే మాటాల్లో శాస్త్రీయత లేదు.
  • సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీకే 130-150 సీట్లు వస్తాయని చెబుతున్నాయి
  • వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి
  • ఇక, 15 రోజుల్లోనే పీకే మాట మర్చారు. 

10:20 AM, Mar 4th, 2024
మోసాల బాబును ప్రజలు నమ్మొద్దు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

  • చంద్రబాబు దళితుల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి కాదు
  • సీఎం జగన్ దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగులకు ఎంతో చేశారు
  • బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీవైపే
  • చంద్రబాబు ప్రజల్ని ఏమార్చేందుకు వస్తున్నారు
  • మోసపూరిత హామీలతో బాబు ఎత్తుగడలు

9:30 AM, Mar 4th, 2024
భీమవరంలో గెలుపు నాదే: గ్రంధి శ్రీనివాస్‌

  • ఎమ్మెల్యే గ్రంధి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పవన్ కల్యాణ్ అభిమానులు
  • భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కామెంట్స్..
  • భీమవరంలో 2019లో పవన్ వెంట వెళ్లిన అభిమానులు తిరిగి.. మళ్లీ ఇప్పుడు నా వద్దకు వస్తున్నారు
  • ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై పాజిటివ్‌గా ఉన్నారు. 
  • నా గురించి తెలుసుకుని పవన్‌ కల్యాణ్‌ను భీమవరం నుంచి పారిపోయారు. 

8:40 AM, Mar 4th, 2024
చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు..

  • అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు.
  • కోడెల శివప్రసాద్‌ మరణానికి కారణం చంద్రబాబే.
  • చంద్రబాబుకు కౌంటరిచ్చిన మంత్రి అంబటి రాంబాబు. 

8:00 AM, Mar 4th, 2024
టీడీపీకి వరుస షాక్‌లు..

  • ధర్మవరంలో టీడీపీకి ఎదురుదెబ్బ
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు
  • ఇప్పటికే పలుచోట్ల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు. 
     

7:20 AM, Mar 4th, 2024
పీకేకు మంత్రి అంబటి కౌంటర్‌..

  • నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు!
  • ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్దంగా వున్నాడు!

7:00 AM, Mar 4th, 2024
సిద్ధం కాని ‘సైకిల్‌’

  • ముందుకు కదలక మొండికేసే.. తెలుగుదేశంలో గందరగోళం
  • సీట్లు తేలవు.. జనం పట్టించుకోరు 
  • రెండో జాబితాపై నోరు మెదపని చంద్రబాబు 
  • బీజేపీతో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు 
  • మరోవైపు బాబు సభలకు స్పందన కరువు 
  • ‘రా కదలిరా’ సభలన్నీ ఫ్లాప్‌  
  • జనసేన– టీడీపీ ఉమ్మడి అ‘జెండా’ ఫెయిల్‌ 
  • ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాన్నే నమ్ముకున్న బాబు

6:50 AM, Mar 4th, 2024
బాబు మాటలే.. పీకే నోట..

  • అవి కిరాయి పలుకులే: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం
  • బెంగాల్‌ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా తప్పుకున్న ప్రశాంత్‌ కిశోర్‌
  • బిహార్‌లో చెల్లని కాసులా మారడంతో చంద్రబాబుతో డీల్‌
  • వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని టైమ్స్‌ నౌ, జీ న్యూస్, రిపబ్లిక్‌ టీవీ లాంటి డజనుకుపైగా మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి
  • సీఎం జగన్‌ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌
  • పొత్తులో సీట్ల లెక్క తేలాక చంద్రబాబు, పవన్‌ నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ అట్టర్‌ ఫ్లాప్‌
  • ఉనికి కాపాడుకోవడానికే పీకేతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్న చంద్రబాబు

6:40 AM, Mar 4th, 2024
బీహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: మంత్రి అమర్నాథ్‌

  • పీకేను చంద్రబాబు పలుమార్లు రహస్యంగా కలిసారు
  • ఒక రోజు క్రితం కూడా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు
  • ఒక పీకే వల్ల కావడం లేదనే రెండో పీకేని తెచ్చుకున్నారా..?
  • మాంత్రికుడనుకుంటున్న ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు సున్నా అయ్యాడు?
  • సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిలా మారాడు 
  • ఏపీలో సర్వే టీం లేని ఆయన డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారు?

6:30 AM, Mar 4th, 2024
పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ

  • రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందే‍శ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.
  • అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం
  • 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం
  • 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం.
  • అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం.
  • సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం
  • పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు
  • పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే.
  • 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి
  • జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం
  • మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం
  • 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం
  • రాజ్‌నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement