గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తెచ్చాం: సీఎం జగన్‌ | Memantha Siddham: CM YS Jagan Public Interaction Speech At Tuggali | Sakshi
Sakshi News home page

58 నెలల్లో గ్రామాభివృద్ధి.. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం: సీఎం జగన్‌

Published Sat, Mar 30 2024 12:19 PM | Last Updated on Sat, Mar 30 2024 3:34 PM

Memantha Siddam: CM YS Jagan Public Interaction Speech AT Tuggali - Sakshi

సాక్షి, కర్నూలు:  గతంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్నిలక ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్‌ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారాయన. 

ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది.  తుగ్గలి, రాతన పరిధిలో 10 వేల జనాభా ఉంది.  ఈ రెండు గ్రామాల సచివాలయాల పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ, వైఎస్సార్‌సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశాం.

బటన్‌ నొక్కడం ద్వారా.. నేరుగా తుగ్గలి, రతన గ్రామాల్లో 95 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరింది. తుగ్గలిలో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. జగన్నన్న విద్యాదీవెన ద్వారా రెండు గ్రామాలకు రూ.2 కోట్లకు పైగా నిధులు అందించాం. ఒక్క తుగ్గలి పరిధిలో వివిధ పథకాల రూపంలో రూ. 29 కోట్ల 65 లక్షల నిధులు మంజూరు చేశాం. రాతన గ్రామానికి పథకాల రూపంలో రూ. 26 కోట్లు 59 లక్షలు అందజేశామని సీఎం జగన్‌ చెప్పారు. మనకు(YSRCP) ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారాయన. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  • ఇక్కడ తుగ్గలి, రాతన  గ్రామాల్లోని రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 10 వేల మంది జనాభా ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో చూసాం.  ఈరోజు మన ప్రభుత్వంలో  ప్రస్ఫుటమైన మార్పులు ఈ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు గత ప్రభుత్వాల్లో ఎందుకు కనిపించలేదు, మీ బిడ్డ ప్రభుత్వంలో  ఎందుకు ఇంత గొప్పగా మార్పు కనిపిస్తోందో.. ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. ఈ రోజు సమాజంలో ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. 

  • ఇదే తుగ్గలి గ్రామానికి సంబంధించి గమనిస్తే 1748 ఇళ్లు ఉండగా, మన పాలనలో నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి డబ్బలు వచ్చాయి. ఎక్కడ లంచాలు  అడిగే వారు లేరు. వివక్షకు చోటు లేదు. కులం, మతం, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అనేది కూడా చూడకుండా, ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా పర్లేదు వారికి కూడా లబ్ది చేకూరాలని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం.

  • 1,748 ఇల్లులుంటే 1,666 గృహాలకు అంటే 95 శాతం ఇళ్లకు లబ్ది చేకూర్చాం. ఇలా లబ్ది చేకూర్చగలమని, ఇలా చేసే పరిస్థితి ఉందని గతంలో ఎవరైనా చెప్పగలిగారా?గత ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, సబ్సిడీలోన్లు కావాలన్నా లంచాలు ఇస్తే కానీ పని  జరిగేది కాదు. తుగ్గలి గ్రామంలో 5200 జనాభా, 1748 ఇల్లులున్న సచివాలయ పరిధిలో  బటన్ నొక్కడం ద్వారా  95 శాతం మందికి  నేరుగా ఖాతాల్లో లబ్ది సమకూరింది. 58 నెలల కాలంలో రూ. 29. 65 కోట్లు ఈ ఒక్క తుగ్గలి గ్రామ ప్రజలకు బటన్ నొక్కి అక్క చెల్లమ్మల కుటుంబాలకు లబ్ధి  చేకూర్చాం.  ఈ నెంబర్ల గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు.

  • రాతన గ్రామానికి సంబంధించి  సచివాలయంలో 4888 మంది జనాభా, 1,569 ఇళ్లులుండగా 95 శాతం ఇల్లులకు లబ్ది చేకూర్చాం. రూ. 26కోట్ల 59 లక్షలను రాతన సచివాలయ పరధిలో అక్క చెల్లమ్మలకు లబ్ది చేకూర్చాం. 
  • అమ్మఒడి పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో రూ. 2.91 కోట్లు, రూ. 2.50 కోట్ల రాతన గ్రామంలో అక్కచెల్లమ్మలకు మంచి మేన మామగా  అందజేశాం. వైఎస్సార్ చేయూత ద్వారా తుగ్గలి రూ. 2.30కోట్లు, రాతనలో రూ. 2.19 కోట్లు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అందజేసాం.  
  • జగనన్న విద్యా దీవెన ద్వారా  తుగ్గలికి రూ. 1.16 కోట్లు, రాతన గ్రామంలో రూ. 1.26 కోట్లు  పెద్ద చదువులకు వెచ్చించి తల్లదండ్రులుఅప్పులు చేయరాదని ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి   ఆ పిల్లల మేనమామగా అందజేశాం. 

  • జగనన్న వసతి దీవెన లో తుగ్గలి రూ. 51 లక్ష, రాతన గ్రామంలో రూ. 54లక్షలు ఇచ్చాం.  ఆసరా ద్వారా తుగ్గలి రూ. 1.95 లక్షలు, రాతన  గ్రామానికి రూ. 65 లక్షలు ఇచ్చాం. సున్నా వడ్డీ కింద రాతన గ్రామానికి రూ. 15 లక్షలు, తుగ్గలి గ్రామానికి రూ. 60 లక్షలు అక్క చెల్లమ్మలకు సాయం అందజేశాం. తుగ్గలికి 66 ఇళ్లు,  122 ఇళ్లు రాతన  గ్రామానికి ఇచ్చాం. వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా తుగ్గలి రూ. 3 లక్షలు, రాతన గ్రామానికి రూ. 4.8 లక్షలు లబ్ది సమకూర్చాం. రాతన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి రూ. 7 కోట్ల 54 లక్షలు ఇచ్చాం. తుగ్గలిలో రూ. 7 కోట్ల 58 లక్షలు ఇచ్చాం.
  • రైతులకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఈ తుగ్గలి గ్రామానికి రూ. 6. 15 కోట్లు, రాతన గ్రామానికి రూ. 5. 49 కోట్లు ఇచ్చాము. ఇలా లంచం లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యం కాదు అనేది దానిని లేకుండా చేసాం.  గాంధీజి గారు కలలు గన్న స్వరాజ్యంను ప్రతీ గ్రామాలకు చూపగలుగుతామని చెప్పాం. ప్రతీ 60 నుంచి 70 ఇళ్లకు వాలంటీర్లు పెట్టాము. వారు చిక్కటి చిరునవ్వుతో పథకాలను నేరుగా అందచేస్తున్నారు. 
  • వైెఎస్సార్ ఆరోగ్య శ్రీని సరికొత్త మార్పులు  తీసుకువచ్చి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ,, ఆరోగ్య ఆసరా రెండు  పథకాల ద్వారా తుగ్గలి గ్రామంలో కోటి రూపాయల వరకు ఖర్చు చేసి ఉచితంగా వైద్యం అందించాం. రాతన గ్రామానికి రూ. 84 లక్షలు  కేటాయించాం.
  • వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. 58 నెలల్లో ప్రతి గ్రామంలో ఓ సచివాలయం నిర్మించి, వాలంటీర్లనుఏర్పాటు చేసాం. రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ ఆర్బీకే. మొట్టమొదటి సారిగా వ్యవసాయం మారింది. రైతన్నలు గతంలో ఇన్సూరెన్స్ కావాలంటే క్రాప్ లోన్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ప్రతీ ఎకరాకు ఇ - క్రాప్ చేసి ఉచితంగా పంట భీమా కల్పించి  ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్నాం. 

  • మొట్టమొదటి సారిగా  ప్రభుత్వ బడుల రూపు రేఖలను మార్చాం.  నాడు - నేడు తెచ్చాం. తెలుగు మీడియం పోయి ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థి కి ట్యాబ్ లు ఇచ్చాం. ఆరో తరగతి ఆపై తరగతులకు చెందిన క్లాస్ రూమ్ లో డిజిటల్ బోధన పేద విద్యార్థులకు చేస్తున్నాం. కార్పొరేట్లు కూడా ప్రభుత్వ స్కూల్స్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది.  మార్పును గమనించాలని కోరుతున్నాను. గ్రామాల్లో విలేజ్ క్లీనిక్ లు ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను తీసుకువచ్చిఅనుసంధానం చేసాం. ఆరోగ్య సురక్ష ప్రతీ ఆరు నెలలకో చేపట్టడంతో ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నాం.

ఆరోగ్య శ్రీ పరిధిని వెయ్యి ప్రొసీజర్  నుంచి  3,300 వరకు పెంచాం. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచాం. వ్యవసాయం, స్కూల్స్, వైద్యం అన్నీ గ్రామ పరిధిలో లంచాలు, వివక్ష లేకుండా  సరికొత్తగా అందిస్తున్నాం. గతానికి భిన్నంగా ఇలాంటి మార్పులు, పరిస్థితులను తీసుకువచ్చాం. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేదాని కోసం కాదు. జరుగుతున్న ఈ  మార్పులు కొనసాగడం కోసం ఓటు వేయాలి, మార్పులు కొనసాగితేేనే పేదల తలరాతులు మారుతాయి. పేద వాడి బ్రతుకులు కూడా మారుతాయని ప్రజలు ఆలోచన చేయాలి. నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే.. ఓటు వేసినప్పుడు మీ బిడ్డకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరిచ్చే సూచనలు, సలహాలు ఇస్తే మరింత మెరుగ్గా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 


అనంతరం పెన్షన్‌ లబ్ధిదారులతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.

దేశంలో రూ. 3వేల పెన్షన్ ఇస్తున్నది మనమే..
మన ప్రభుత్వం రాక ముందు చంద్రబాబు పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో పెన్షన్ ఎంత అని ప్రతి అవ్వని, తాతను అడగాలి. ఆయన హయాంలో పెన్షన్ ఎంత.. మీ బిడ్డ హయాంలో ఇవాళ పెన్షన్  ఎంత అని అడగాలి. దేశంలోనే రూ. 3 వేల పెన్షన్  ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. పెన్షన్ల కోసం ఏటా రూ. 24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

మిగతా రాష్ట్రాల్లోను పోల్చుకుంటే రెండో స్థానంలో తెలంగాణ  కేవలం రూ. 12 వేల కోట్లు ఉంది. ఎక్కడ చూసినా పెన్షన్ రూ. 500 మాత్రమే ఉంది. మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వ, తాతా, వితంతుల మీద ప్రేమ, అభిమానంతో 66 లక్షల మందికి ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రూ. 39 లక్షలు మందికి మాత్రమే ఇచ్చేవారు. 66 లక్షల్లో 45 లక్షలు మంది అక్క చెల్లెమ్మలు, అవ్వలే ఉన్నారు అని సీఎం తన ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement