సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్‌ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌లను కొనసాగించారు.
81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు.
2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు.
మొత్తం ఖర్చు 54,234కోట్లు.
2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు.
2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు.
కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు.
ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు.
పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం.
►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది.
►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది.
►అన్నారం బ్యారేజ్‌లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు.
►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది.
►అక్టోబర్‌లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం.
►ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది.
►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే బీఆర్‌ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు.
►గత ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ప్రాజెక్ట్‌లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది.
►కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది.
►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు.
►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్‌లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్‌లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది.
►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్‌లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్‌తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము.
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక..
- ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు.
- రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది.
- 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి.
- ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు.
- తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు.
- 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు.
- బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్‌ను తొలగించలేదు.
- పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment