Pawan : నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు | Pawan Kalyan Doubts About His Own Party Cadre | Sakshi
Sakshi News home page

Pawan : నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు

Published Thu, Jul 13 2023 2:37 PM | Last Updated on Thu, Jul 13 2023 3:12 PM

 Pawan Kalyan Doubts About His Own Party Cadre - Sakshi

ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌కు కాస్తా నిజాలు బోధపడుతున్నాయి. అదే సమయంలో ఆయన మీద ఆయనకే అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీలో అంతర్గత సమాచారం అంతా తనకు చుట్టున్నే వాళ్లే బయటపెడుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌లో ఉంది. అదే విషయాన్ని ఇవ్వాళ పార్టీ సమావేశంలో బయటపెట్టేశారు పవన్‌.

తెలుగుదేశంకు బీ టీం జనసేన
తెలుగుదేశం పార్టీకి జనసేన పూర్తి స్థాయిలో అనుంగు పాత్ర పోషిస్తుందన్నది జనమందరిలో ఉన్న అభిప్రాయం. 2014 నుంచి ఇప్పటివరకు పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాలు, చేసిన యాత్రలు, చేపట్టిన కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించే విధంగానే ఉన్నాయి. అంతెందుకు అధికారంలో ఉన్నప్పుడయినా, తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నప్పుడయినా (వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌.. ఓటుకు కోట్లు) ప్రతిపక్షంలో ఉన్నప్పుడయినా.. చంద్రబాబును పల్లెత్తు మాట అననీయలేదు. ఇక వారాహి యాత్రను కూడా చాలా జాగ్రత్తగా లోకేష్‌ పాదయాత్రకు ఇబ్బంది లేకుండా నడుపుతున్నారు. లోకేష్‌ రాయలసీమ, నెల్లూరులో పర్యటిస్తే.. పవన్‌కు ఉభయగోదావరి జిల్లాలను ఇచ్చి కాపులను ఎగదోయాలన్న బాధ్యతను చంద్రబాబు ఇచ్చాడు. ఆ ప్లాన్‌ ప్రకారమే పవన్‌ యాత్ర నడుస్తోంది, రెచ్చగొట్టే ప్రకటనలు వస్తున్నాయి పవన్‌ నుంచి.

ఇవ్వాళ పవన్‌ ఏమన్నాడు?
"పార్టీ అంతర్గత సమాచారం అంతా మనవాళ్లే ఇస్తున్నట్టున్నారు. అసలు ఇన్‌సైడ్‌ ఇన్‌ఫర్మేషన్‌ బయటికెళ్తుందంటే అది మన వాళ్లే. మనలో ఎవరో ఒకరు ఆఫీసు తలుపులు తెరిచి గుట్టంతా బయటపెడుతున్నారు.  తెలుగుదేశం పార్టీకి మనం బీ టీం అని ప్రత్యర్థులు ఆరోపించినప్పుడు నేను ఏమీ అనుకోలేదు. మనం బీ టీం అని వైఎస్సార్‌సిపి ఆరోపించడం వేరు, మన వాళ్లు పూర్తిగా నమ్మడం వేరు. దాంతో పాటు మన వాళ్లు నన్నే సందేహిస్తున్నారు, నామీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు పవన్‌ చేస్తుందేంటీ? చెబుతుందేంటీ?
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికి వచ్చానంటూ చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పటివరకు చేసిందేం లేదు. పార్ట్‌టైం పొలిటిషియన్‌ తరహాలో అప్పుడప్పుడు గెస్ట్‌ అప్పియరెన్స్‌.. అది కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమే. ఇక పార్టీలోనే కాదు, లోకమంతా పవన్‌ను టిడిపికి బీటీం అని మాత్రమే నమ్ముతోంది తప్ప.. పవన్‌ను సెపరేటు పొలిటిషియన్‌ అని చూడట్లేదు. అందుకే ఆయన్ను దత్తపుత్రుడిగా అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు ప్యాకేజీతోనే జనసేన నడుస్తుందని చెప్పుకుంటున్నారు.

సీఎం పదవి విషయంలో మడతపడ్డ నాలుక
ముందు నేనే సీఎం అంటూ పవన్‌ ప్రచారంలోకి దిగాడు. ఆ వెంటనే టిడిపి క్యాంపు నుంచి డైరెక్షన్‌ రావడంతో.. వెంటనే నాలుక మడతేశాడు. అసలు నాకు సీఎం పదవేంటీ? నేనేలా గెలుస్తాను? నాకు ఎమ్మెల్యేలెక్కడ అంటూ పచ్చమీడియా ఇంటర్వ్యూలో అమాయకంగా చెప్పేసాడు. ఈ మాత్రం ఇండికేషన్‌ చాలదా? ప్రజలకైనా జనసేన వర్గాలకైనా.. అందుకే పవన్‌ ఇప్పుడయినా.. ఎప్పుడయినా టిడిపికి బీ టీం అన్నదే ప్రజల్లో ఉన్న బలమైన టాక్‌చదవండి: చంద్రబాబు చేతిలో పవన్‌ కల్యాణ్‌ కీలుబొమ్మ: అడపా శేషు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement