TDP Chandrababu Naidu Cases Updates
05:17 PM, Nov 6, 2023
తెలంగాణలో టీడీపీ.. మరొకరు అవుట్
►తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా
►గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కోల్పోయిన మాకు కనీసం ఎవరు వస్తున్నారన్న సమాచారం కూడా తెలవడం లేదు
►హైదరాబాదుకు లోకేష్ బాబు అయినా గాని బాలకృష్ణ గాని ఎవరు వచ్చినా కనీసం సమాచారం తెలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసుకున్న బిల్డర్ ప్రవీణ్
►తన రాజీనామాని ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు నాయుడుకు పంపుతున్నట్టు తెలిపిన బిల్డర్ ప్రవీణ్
04:20 PM, Nov 6, 2023
బాలకృష్ణకు అర్థం కావడానికి ఆలస్యమవుతోందా?
► కుటుంబసభ్యులపైనే చాణక్య నీతిని ప్రదర్శిస్తోన్న చంద్రబాబు
► అరెస్టయినపుడు రెండు రోజులు బాలకృష్ణ హడావిడి చూసి అర్జంటుగా ప్లాన్ మార్చిన బాబు
► ఇప్పటికిప్పుడు తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపించాలని బాలకృష్ణకు అసైన్‌మెంట్
► బావ ఆదేశాలు అర్థం కాక.. తలపట్టుకుని హైదరాబాద్ వచ్చిన బాలకృష్ణ
► ఆ వెంటనే భీకర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని ప్రకటించిన బాలకృష్ణ
► నెల గడవకముందే బాలకృష్ణ స్టేట్‌మెంట్‌ను చెత్తబుట్టలో వేసేసిన బాబు
► అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీనే చేయబోవడం లేదని పార్టీ ప్రకటన
► బాబుకు ముందే ఇవన్నీ తెలిసి మరీ బాలకృష్ణను తెలంగాణకు పంపారని పార్టీలో చర్చ
► లోకేష్‌కు ఎలాంటి కష్టం రాకుండా అన్ని అడ్డంకులు తొలగించే పనుల్లో చంద్రబాబు
04:05 PM, Nov 6, 2023
అచ్చెన్నకు వెన్నుపోటేనా?
► తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై అనుమానపు చూపులు
► అచ్చెన్నను తప్పిస్తారని పార్టీలో విస్తృత ప్రచారం
► ఇప్పటికే పార్టీ లేదు.. xx లేదు అంటూ ప్రకటనలు చేసి కెమెరాలకు చిక్కిన అచ్చెన్న
► పైకి చేస్తున్న ప్రకటనలు వేరు, అంకిత భావం వేరంటున్న చంద్రబాబు కోటరీ
► అర్జంటుగా అచ్చెన్నను పక్కనబెట్టి లోకేష్‌కు ఆ బాధ్యతలు ఇవ్వాలంటున్న కోటరీ
► లోకేష్ అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి బెటర్ అంటోన్న కోటరీ
► ఎలాగూ తెలంగాణలో పోటీ చేయడం లేదు, పార్టీకి తెలంగాణలో చోటు కూడా లేదు
► జాతీయ హోదా ఉండదు కాబట్టి, ఏపీలోనే మార్పులు చేసుకోవాలంటున్న బాబు వర్గీయులు
03:45 PM, Nov 6, 2023
మ్యానిఫెస్టోపై టిడిపి, జనసేన మల్లగుల్లాలు
► మ్యానిఫెస్టోపై మొన్న పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు
► ఏం చేద్దాం? మన దగ్గర ఉన్న వాగ్దానాలేంటీ?
► ఇన్నాళ్లు సర్కారు చేస్తోన్న సంక్షేమాన్ని తప్పుబట్టాం కదా? ఇప్పుడేం చెబుదాం?
► సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుందన్నాం కదా.. ఇప్పుడు మనం మాటెలా మార్చుదాం?
► ఇప్పటికే మాట నిలబెట్టుకోలేమన్న పేరుంది, అదెలా పోగోడదాం?
► ఏమని చెబితే జనం నమ్ముతారు? ఎలా చెప్పి వారిని నమ్మించాలి?
► ఇప్పుడు అమలవుతున్న పథకాలను ఎలా తప్పుబడదాం?
► అసలు మ్యానిఫెస్టో ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి?
► అనవసరంగా మ్యానిఫెస్టో ప్రస్తావన తెచ్చి ఇబ్బంది పడుతున్నామా?
► కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న పథకాలు మన దగ్గర పని చేస్తాయా?
► తెలంగాణలో జనం కాంగ్రెస్ పథకాల మీద ఆసక్తి చూపిస్తున్నారా?
03:30 PM, Nov 6, 2023
లూథ్రా గారు మీరే చెప్పండి?
► సమన్వయ సమావేశాలకు హాజరయితే కోర్టు షరతులను ఉల్లంఘించినట్టవుతుందా?
► కోర్టు షరతులను ఎలా ఉల్లంఘించాలి? సాంకేతికంగా ఎంతవరకు ముందుకెళ్లొచ్చు
► సమన్వయ కమిటీ సమావేశాలకు నేరుగా వెళ్తే కోర్టు తప్పుపడుతుందా?
► ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ మోడ్‌లో హాజరు కావొచ్చా?
► రాజకీయ చర్చలు జరిపితే ఆంక్షలు ఉల్లంఘించినట్టా?
► సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు
(ఫైల్ ఫోటో : లూథ్రాతో చంద్రబాబు, లోకేష్)
03:20 PM, Nov 6, 2023
సమన్వయానికి హాజరు కావొచ్చా? లేదా?
► మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు తహతహ
► సమన్వయ కమిటీ సమావేశాలకు అర్జంటుగా వెళ్లాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు
► తాను వెళ్లకపోతే.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో చంద్రబాబు
► తెలుగుదేశం పార్టీ తరపున లోకేష్ మాట అంతగా వెళ్లట్లేదన్న భావనలో పార్టీ సీనియర్లు
► ఇలాగే ఉంటే.. జనసేనకు 50 సీట్లు ఇవ్వాల్సి వస్తోందన్న ఆందోళనలో చంద్రబాబు
► తాను వెళితేనే పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు
► జనసేనను ఎంత వరకు పరిమితం చేయాలి? తమకు అవకాశం లేని సీట్లను ఎలా అప్పగించాలి?
► జనసేన తరపున కూడా టిడిపి లీడర్లనే ఎలా పోటికి దింపాలి?
► తమ వాదనకు అనుకూలంగా ఎలాంటి సర్వేలను తెర మీదికి తీసుకురావాలి?
► 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని రాజకీయం కోసం ఎలా వాడాలి?
03:15 PM, Nov 6, 2023
మళ్లీ సమన్వయ సమావేశం
► టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశానికి వేదిక ఖరారు
► ఈ నెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమన్వయ కమిటీ రెండో భేటీ
► ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై చర్చ
03:05 PM, Nov 6, 2023
కోవర్టు కాదు : పురందేశ్వరీ
► నేను చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి కోవర్టును కాను
► విధానపరమైన లోపాలను ఎత్తి చూపితే టీడీపీ కోవర్టు అంటారా?
► ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి : పురందేశ్వరీ
02:45 PM, Nov 6, 2023పవన్ ఎప్పటికీ CM కాలేరు : నారాయణ స్వామి
► పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్
► పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేరు
► టీడీపీ, జనసేన కు డిపాజిట్ రాదు
► పవన్ కళ్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నారు
► బాబు అవినీతి పురంధేశ్వరి కి కనిపించదా ? : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
02:30 PM, Nov 6, 2023
ఇంటికి బాబు, రేపు ఆపరేషన్
► AIG ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు
► వైద్య పరీక్షలు చేయించుకుని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు
► రేపు LV ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్
02:00 PM, Nov 6, 2023
అటాచ్‌మెంట్ కోసం పిటిషన్
► ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కోసం CID పిటిషన్
► ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
► చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ACB కోర్టులో ఏపీ CID పిటిషన్
► చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ ప్రతిపాదన
► CID ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు
► ACB కోర్టు అనుమతిస్తే అటాచ్ మెంట్ ప్రక్రియ మొదలుపెట్టనున్న CID
01:30 PM, Nov 6, 2023
పార్టీ సీనియర్ల తీరుపై చంద్రబాబు గుర్రు
► జైల్లో 52 రోజులుంటే పార్టీని ఎవరూ పట్టించుకోలేదని బాబు ఆవేదన
► దిక్కు, దివానం లేకుండా పార్టీని వదిలేశారని ఆవేదన
► కలవడానికి వచ్చిన సీనియర్లపై తీవ్ర ఆగ్రహం
► తాను జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందన్న సీను ఎలా వచ్చిందని ప్రశ్నలు
► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ నామమాత్రం ఆందోళనలతో సరిపెట్టారని ఆగ్రహం
► విడుదలైన తర్వాత అప్పటికప్పుడు జనసమీకరణ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన
12:30 PM, Nov 6, 2023
ఎవరి పథకం? తెలుగుదేశం ఒక్కరిదేనా? జనసేనకు కూడా పొత్తుందా?
► హఠాత్తుగా 3 సిలిండర్ల పథకం ప్రకటించిన తెలుగుదేశం
► మాటమాత్రంగా చెప్పకుండా ప్రకటించారంటున్న జనసేన నేతలు
► మూడు సిలిండర్లు ఇస్తామన్న వాగ్దానాన్ని జనమెలా నమ్ముతారంటున్న జనసేన
► పైగా అందులో అంతగా ఆకట్టుకునే అంశమేముందని ప్రశ్న
► జైలు ముందు పొత్తు ప్రకటించిన పవన్‌ను కనీసం బ్యానర్లలోనైనా పెట్టుకోరా అంటోన్న జనసేన నేతలు
12:00 PM, Nov 6, 2023
పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటర్
►పురంధేశ్వరి.. మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది.
►రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు.
►బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు.
►దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే..
►మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
►పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కాలమే సమాధానం చెబుతుంది.
1/2: చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
11: 47AM, Nov 6, 2023
►ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ పై నేడు సీఐడీ పిటిషన్
►ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న ఏపీ సీఐడీ
►చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్‌కు సీఐడీ ప్రతిపాదన
►సీఐడీ ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు
11:45AM, Nov 6, 2023
►గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు, మళ్లీ వైద్య పరీక్షలు
►రెండు రోజుల కింద సమగ్ర వైద్య పరీక్షలు, ఆ పరీక్షలకు కొనసాగింపుగా ఇవ్వాళ మరోసారి పరీక్షలు
11:40AM, Nov 6, 2023
►ఈ నెల 9న జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
►ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయం
►ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మేనిఫెస్టో క్షేత్రస్థాయి నుంచి సమన్వయం వంటి మూడు అంశాలపై ప్రధానంగా చర్చ
► చంద్రబాబుపై వరుస కేసులు వంటి అంశాలపై భేటీలో చర్చ
11:30AM, Nov 6, 2023
►టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీకానున్న టీడీపీ-జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ
►రెండు పార్టీల నుంచి హాజరుకానున్న ఆరుగురు సభ్యులు
10:50 AM, Nov 6, 2023
చంద్రబాబు, పవన్‌లపై మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజం
►పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగలు
►2014లో పవన్ మద్దతు ఇచ్చి చంద్రబాబు ని నెగ్గింఛానని చెప్పాడు. తరువాత టీడీపీ నాయకులు అతని వల్ల మేము గెలవడం ఏంటని నానా మాటలు అన్న సంగతి మరచిపోయావ్.
►ఏ మొహం పెట్టుకొని ఉమ్మడి మ్యానిఫెస్టో పెడుతున్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి?
►చంద్రబాబుని దొంగగా కోర్టు నిర్దారిస్తే జైలుకు వెళ్లి పవన్ కాళ్ళు పట్టుకున్నాడని సామాజిక వర్గం మొత్తం సిగ్గు పడ్డ పరిస్థితి.
►పవన్ ని నమ్మి ప్రజలు ఎలా ఓటు వెయ్యాలి?
►చంద్రబాబు ఇంతవరకు ఎవరినైనా వాడుకుని వదిలేయకుండా ఉన్నాడా? అందరిని వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు.
►మోసానికి, ద్రోహానికి పేటెంట్ తీసుకున్న చంద్రబాబుతో పవన్ ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేస్తున్నాడు అనడం ఎంత దారుణం.
►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని విజయోత్సవం చేస్తున్నామనడం వారి అవివేకానికి నిదర్శనం.
►పవన్, చంద్రబాబు ఇద్దరికీ నీతి, నియమాలు లేవు.
9:40 AM, Nov 6, 2023
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో పురంధేశ్వరిదే కీలక పాత్ర: విజయసాయి
►ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే.
►ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే..
►ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది.
►సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు.
►"అన్న టీడీపీ" అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు.
►ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్‌లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి
1/3 :ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
8:30 AM, Nov 6, 2023
పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్
►నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది.
►తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా.
►కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారిన పురంధేశ్వరి.
►పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తున్న పురంధేశ్వరి
►ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు.
నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
6:55 AM, Nov 6, 2023
చంద్రబాబు కన్నింగ్ ప్లాన్స్..
►రాజమండ్రి జైలులో అనారోగ్యం అంటూ డ్రామాలు
►మధ్యంతర బెయిల్ వచ్చాక వైద్యం తప్ప అన్ని పనుల్లో బిజీ
►ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న బాబు చూసే చెప్పరేమో!
‘‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ ఈ సామెత బహుశా చంద్రబాబు లాంటి వ్యక్తిని చూశాకే పుట్టిందేమో. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డ్రామాలాడిన @ncbn.. మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత వైద్యం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాల్ని… pic.twitter.com/uFDMirCdc1
— YSR Congress Party (@YSRCParty) November 5, 2023
6:50 AM, Nov 6, 2023
అనారోగ్యమంటూ ఎల్లో బ్యాచ్ కలరింగ్.. మరి ఇదేంటీ?
►వైద్యం కోసం మధ్యంతర బెయిల్
►రాజకీయం చక్కదిద్దే పనిలో బాబు ఫుల్ బిజీ
►అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏకం 14 గంటలు కారులో జర్నీ
►పవన్‌తో గంటల పాటు భేటీ..
►హెల్త్ బాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేయగలడు?
►జైలు నుంచి బయటకు రావాలన్న డ్రామాలే తప్ప.. అనారోగ్యం కాదు!
వైద్యం కోసం మధ్యంతర బెయిల్‌ను తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. రాజకీయ కార్యకలాపాల్ని చక్కబెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. జైల్లో తీవ్ర అనారోగ్యంతో @ncbn బాధపడుతున్నట్లు @JaiTDP అండ్ కో కలరింగ్ ఇచ్చింది. కానీ.. రాజమండ్రి టు కరకట్టకి 14 గంటలు కారులో… pic.twitter.com/YX8tlcqaXN
— YSR Congress Party (@YSRCParty) November 5, 2023
6:50 AM, Nov 6, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP
Comments
Please login to add a commentAdd a comment