సాక్షి, అనంతపురం: హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలను టీడీపీ నేతలు ధిక్కరించారు. బాబు ఆదేశాలను లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి అశ్విణికి టీడీపీ నేతలు ప్రచారం మొదులుపెట్టారు. అదీకాకుండా చంద్రబాబు బహిష్కరణ ఆదేశాలు పట్టించుకోమని హిందూపురంకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.
చంద్రబాబుకు చుక్కెదురు
పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపుని తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేశారు. ఎంపీటీసీ, జెడ్పిటీసీ అభ్యర్థుల తరపున టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో టీడీపీ జెడ్పిటీసీ అభ్యర్థి వట్టూరి వెంకట రాంబాబు, ఎంపీటీసీ అభ్యర్థి సరిపల్లి పద్మ తరపున మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ ఇంచార్జి వలవల బాబ్జి ప్రచారం చేస్తున్నారు.
బయటపడ్డ టీడీపీ లోపాయకారి ప్రచారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటన చేసినా లోపాయకారిగా టీడీపీ అభ్యర్థిలు పోటీలో కొనసాగాలని అంతర్గత ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయాన్ని సొంతపార్టీ అభ్యర్థులే చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ఎన్నికలు బహిష్కరించామని చెబుతునే మరోవైపు ఎన్నికల ప్రచారం చేస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు జడ్పిటీసీ అభ్యర్థి బీరం శిరీష ఎన్నికలకు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు సూచన మేరకే పోటీలో కొనసాగుతున్నామని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీలో ఉంటామని అంటున్నారు.
చదవండి: దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్
Comments
Please login to add a commentAdd a comment