ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల ఎత్తులకు ఆశావహులు చిత్తవుతున్నారు. పార్టీ జెండా మోసి మోసపోయామని కొందరు.. పార్టీ కార్యక్రమాలకు డబ్బులు తగలేసి అప్పుల పాలయ్యామని మరికొందరు రగిలి పోతున్నారు. అధికార పార్టీ ఛీకొట్టిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని స్థానిక నేతలు నిలదీస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇచ్చి అవమానించారని ఇంకొందరు రుసరుసలాడుతున్నారు.
సాక్షి, తిరుపతి: టీడీపీ, జనసేనలో టికెట్ల లొల్లి రాజుకుంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, అసలు కండువానే కప్పుకోని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబు సత్యవేడు అభ్యరి్థగా ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ జేడీ రాజశేఖర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులంతా శుక్రవారం వరదయ్యపాళెం చేరుకుని నిరసన తెలియజేశారు. ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించి అమ్ముకున్న ఆదిమూలంకి ఎలా టికెట్ ఇస్తారని చంద్రబాబుని ప్రశ్నించారు.
మొన్నటి వరకు ఆదిమూలం అవినీతిపరుడని చెప్పిన తాము ఇప్పుడు కోనేటికి ఓటేయమని ఎలా అడగాలని నిలదీస్తున్నారు. స్థానిక ప్రజలకు సేవచేయడంలో విఫలమయ్యారని తెలుసుకున్నాకే ఆయన్ని వైఎస్సార్‌సీపీ అధిష్టానం పక్కనపెట్టిందని గుర్తుచేశారు. అటువంటి నేతను టీడీపీ అభ్య రి్థగా ఎలా నియమిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధ్వజమెత్తారు. సత్యవేడు అభ్యర్థి తానేనని నాలుగేళ్లుగా ఖర్చు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హేమలతి కుమార్తె డాక్టర్ హెలెన్ అయితే రెండు రోజులుగా నివాసానికే పరిమితమై బోరున విలపిస్తున్నట్లు సమాచారం. సత్యవేడు అసంతృప్తి నేతలంతా నేడు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేశారు.
తిరుపతి నేతలకు తీవ్ర అవమానం
చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించినట్లు తెలిసింది. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారంటూ జనసేన నాయకుడు కిరణ్‌రాయల్ పార్టీ నాయకుల అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఈ విషయంపై తిరుపతికి చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నారు. ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపినట్లు తెలిసింది.
అందులో భాగంగా శుక్రవారం ఉదయం ఓ కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం తిరుపతి నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. చివరకు అధిష్టానం తిరుపతి టీడీపీ, జనసేన నేతలకు సీరియస్ వారి్నంగ్ ఇవ్వడంతో మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సమావేశం, నిరసన ర్యాలీలు రద్దు చేసినట్లు ప్రకటించి ఆరణి శ్రీనివాసులు కోసం తామంతా కలిసి పనిచేస్తామని పసుపులేటి హరిప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేయడం గమనార్హం. మరో వైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం. ఇంకా టికెట్ ఆశించిన తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, ఊకా విజయకుమార్, జేబీ శ్రీనివాసులు చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
శ్రీకాళహస్తిలో జనసేన వర్సెస్ టీడీపీ
శ్రీకాళహస్తి టికెట్ బొజ్జల సుదీర్‌రెడ్డికి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు గురువారం రాత్రి జనసేన కార్యా లయం ముందు బాణసంచా పేల్చి హంగామా చేశారు. జనసేన నాయకురాలు వినూత, అనుచరులను రెచ్చ గొట్టేల వ్యవహరించారు. దీనిపై ప్ర శ్నించడంతో బొజ్జల అనుచరులు జనసేన శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ఇంతజరిగినా అధిష్టానం నుంచి కనీసం పలకరింపు కూడా లేకపోవడంతో జనసేనకు రాజీనామా చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని భావించి కోలా ఆనంద్ కొద్ది రోజులుగా ప్రచారం కూడా ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరినా ప్రయోజనం లేకుండా పోయింది. వీరంతా నేడు వారి అనుచరులతో సమావేశం కానున్నారు. నిరసన ర్యాలీ శ్రీకాళహస్తి టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నాయకులు శుక్రవారం రాత్రి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
యాదవులకు చుక్కెదురు
పొత్తులో భాగంగా పుంగనూరు నుంచి తానే పోటీలో ఉంటానని చిత్తూరు జిల్లా పుంగనూరుకు రామచంద్రయాదవ్ చెప్పుకుంటూ వచ్చారు. బీజేపీ నుంచి లేదా జనసేన అభ్యర్థి తనేనని ప్రకటించుకున్నారు. చివరకు టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రారెడ్డినే ఖరారు చేయడంతో యాదవ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీవై పార్టీ పేరుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయా లని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకటగిరి టికెట్ ఈ సారి బీసీలకు కేటాయించాలని మస్తాన్‌యాదవ్, మరికొందరు చేనేత కారి్మకులు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసి విన్నవించారు. రా కదలి రా సమయంలో కూడా బీసీలంతా ఏకమై చంద్రబాబుని కలిసి విన్నవించారు. ఆ తరువాత కూడా సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేసి, ఆ కాపీని టీడీపీ అధిష్టానానికి పంపారు.
అయినా ప్ర³యోజనం లేదు. చివరకు చంద్రబాబు సా మాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండో భార్య కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పేరును ప్రకటించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్ దివాకర్‌రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాలని గత కొంత కాలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ వచ్చారు. తరుచూ ఆతీ్మయ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి నజరానాలు అందిస్తూ పలువురి దృష్టిలో పడేందుకు కిందామీదా పడ్డారు. చివరకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నానికి టికెట్ కేటాయించడంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఆగ్రహంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment