పాడైన చిక్కీలు.. కొట్టేసిన రికార్డులు | - | Sakshi
Sakshi News home page

పాడైన చిక్కీలు.. కొట్టేసిన రికార్డులు

Published Sat, Aug 24 2024 1:16 PM | Last Updated on Sat, Aug 24 2024 1:16 PM

పాడైన చిక్కీలు.. కొట్టేసిన రికార్డులు

మద్దిపాడు: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి అసహనం వ్యక్తం చేశారు. మండంలోని లింగంగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, చిక్కీలు, రాగిపిండి తదితర విషయాలను పరిశీలించారు. చిక్కీలు ఎక్స్‌పైర్డ్‌ డేట్‌ అయిపోయి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పాఠశాలలో వెనుక వైపు ఉన్న టాయిలెట్స్‌ వెళ్లేందుకు పాములు తిరుగుతున్నాయని గుర్తించారు. దీని విషయమై ఇన్‌చార్జిని ప్రశ్నించగా ఆయన రెండు రోజుల్లో పాఠశాలలో పూర్తిగా శుభ్రం చేయిస్తానని తెలిపారు. మధ్యాహ్న భోజనం రిజిస్టరు పరిశీలించి స్టాకును తనిఖీ చేశారు. రికార్డు మొత్తం కొట్టివేతలు వైట్నర్‌ పూయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త ఉండడం మట్టితో నిండి ఉండడం గమనించి ఉపాధ్యాయులను పిలిచి హెచ్చరించారు. విద్యార్థులకు అవరమైన మేరకు నీరు అందడం లేదని పలువురు విద్యార్థులు ఆమెకు తెలిపారు. దీంతో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుని పిలిచి నీరు సక్రమంలో అందేలా చూడాలని, పాఠశాలలో కంప్‌లైంట్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్గమధ్యంలో ఒంగోలు రూరల్‌ పరిధిలోని మండువవారిపాలెం అంబేడ్కర్‌ నగర్లో ఉన్న అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లగా అక్కడ విద్యార్థులు ఒక్కరు కూడా లేరు. అంగన్‌వాడీ వర్కర్‌ సెంటర్‌ను మూసి వేసే క్రమంలో కమిషన్‌ మెంబర్‌ అక్కడకు చేరుకుని రికార్డులు చూపాలని అడగడంతో ఆమె చూపకుండా దాదాపు గంట పైగా సతాయించడంతో వెంటనే ఐసీడీఎస్‌ పీడీ ఫణి రాజకుమారికి ఫోన్‌ చేసి సెంటర్‌ పరిస్ధితిని వివరించారు. అంగన్‌వాడీ సెంటర్లో ఉన్న లోపాలు తెలిపి సదరు అంగన్‌వాడీ వర్కర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఆమె త్రోవగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి బాలల విషయంలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఒంగోలు ఎంఈఓ సరస్వతి, సోషల్‌ వర్కర వీరాంజనేయులు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లింగంగుంట జెడ్పీ హైస్కూల్లో ఎక్స్‌పైర్డ్‌ డేట్‌ అయిపోయిన చిక్కీలు మధ్యాహ్న భోజనం రికార్డుల్లో కొట్టివేతలు తనిఖీలో బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలి ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement