No Headline
సమాజంలో విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధులను ఆధునిక వైద్యంతో తిప్పికొడుతూ.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులను కాపాడుతూ.. ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులకు కనీస రక్షణ కరువైంది. ఆస్పత్రుల్లో తరచూ చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అఘాయిత్యాలు డాక్టర్ల ఆత్మస్థైర్యాన్నే దెబ్బతీసేలా మారడం ఆందోళన కలిగించే విషయం. వారి రక్షణ కోసమంటూ ప్రభుత్వాలు చేసిన చట్టాలు చట్టుబండలయ్యాయి. కోల్‌కతాలోని ఆర్.జి.కార్ ఆస్పత్రి ఘటన వైద్యుల మనోభావాలను మరింత కుంగదీసింది. వీటికితోటు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిర్భయంగా పనిచేసేలా సురక్షిత పరిసరాలు, మెరుగైన భద్రత కోసం వైద్యులు తరుచూ గళం విప్పుతున్నా వారి మొర ఆలకించే నాథుడే లేరు. ప్రాణాలు నిలుపుతున్న డాక్టర్ దేవుళ్లకు అందరం అండగా నిలుద్దాం..
Comments
Please login to add a commentAdd a comment