పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యం
ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యం అని మాజీ మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనాయకులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఈనెల 4న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ తరలివచ్చేలా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. సంతనూతలపాడు అంటేనే సొంత నియోజకవర్గంగా భావించే శివప్రసాదరెడ్డిని ఘనంగా స్వాగతించుకుందామన్నారు. దాతృత్వానికి మారుపేరులా ఉండే బూచేపల్లి కుటుంబం అంటేనే జిల్లాలో ఒక ప్రత్యేక అభిమానం ప్రతి ఒక్కరిలో ఉంటుందని, అటువంటి బూచేపల్లి శివప్రసాదరెడ్డి అధ్యక్షునిగా వైఎస్సార్ సీపీని బలోపేతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా మండలాల్లో పరిస్థితిని గురించి పలువురు ముఖ్య నాయకుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీ పట్ల ప్రజల్లో ఒక సానుకూల దృక్పథం కనిపిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు బహిర్గతపరుస్తూ వాటి పరిష్కారానికి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కృషిచేద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ జి.చంద్ర, చీమకుర్తి నగర, మండల అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖర్‌రెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రవణమయ్య, ఎంపీపీ విజయ, మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, మద్దిపాడు ఎంపీపీ వాకా కోటిరెడ్డి, మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలమాలపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్యనాయకులు కర్నాటి ప్రసాద్, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల సుబ్బారావు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
4వ తేదీ నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త, అభిమాని తరలివచ్చేలా కృషిచేద్దాం నూతన జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఘనంగా స్వాగతించుకుందాం మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment