రోడ్ల విస్తరణపై ఉత్కంఠ
కనిగిరి రూరల్: మున్సిపల్ అధికారులు చేపట్టిన రోడ్ల విస్తరణలో భాగంగా ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం రాత్రి బొడ్డు చావిడి సెంటర్‌లోని.. బొడ్డు చావిడి టు నాజ్ సెంటర్ వరకు వ్యాపారులు, గృహ నిర్మాణదారులతో మున్సిపల్ అధికారుల భేటీ జరిగింది. అందులో కనీసం 34 అడుగులు రోడ్డు విస్తరణకు సహకరించాలని, లేకపోతే పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్డు విస్తరణ చేపడతామని కమిషనర్ డానియల్ జోసఫ్, టీపీఎస్ సువర్ణ కుమార్ వ్యాపారులకు స్పష్టం చేశారు. మళ్లీ వ్యాపారుల విన్నపం మేరకు ఆదివారం మున్సిపల్ అధికారులు..అక్రమణదారులతో సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణకు సహకరించాలని కోరారు. కనీసం 30 అడుగుల రోడ్ల విస్తరణకు అంగీకారం తెలుపకపోతే చట్టప్రకారం పూర్తి స్థాయిలో మున్సిపల్, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న 40 అడుగుల రోడ్డు వెడల్పు చర్యలను గురువారం చేపడతామని, అందులో ఎలాంటి సందేహం లేదని..వ్యాపారులు, గృహ నిర్మాణదారులకు తెగేసి చెప్పినట్లు టీపీఎస్ సువర్ణ కుమార్ వెల్లడించారు.
రోడ్ల విస్తరణ ప్రక్రియకు ఆదివారం తాత్కాలిక విరామం
కారణాలు ఏమైనా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి ఆదివారం తాత్కాలిక బ్రేక్ పడింది. శనివారం జరిగిన మెట్ల తొలగింపు, తాత్కాలిక షెడ్లు, రేకుల తొలగింపులో వచ్చిన వ్యర్థాలను తొలగించేందుకు సమయాన్ని కేటాయించి కాలయాపన చేశారు. కొందరి పెద్ద కట్టడాల జోలికి వెళ్ల లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఆదివారం తొలగింపులకు తాత్కాలిక బ్రేక్ 30 అడుగులకు స్వచ్ఛంద ఆక్రమణల తొలగింపుపై కొన ‘సా..గుతున్న చర్చ’ అంగీకరించపోతే గురువారం వేటు తప్పదంటున్న టీపీఎస్
Comments
Please login to add a commentAdd a comment