26న సింగరాయకొండలో జాబ్‌మేళా
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 26వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టీ భరద్వాజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు 18 ఏళ్లు నిండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. అభ్యర్థులు పదో తరగతి నుంచి డిగ్రీ విద్యను అభ్యసించి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.13 వేల నుండి రూ.28 వేల వరకూ వేతనం ఇస్తారని చెప్పారు. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ఫొటోస్టాట్ కాపీలను తీసుకురావాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు 8897964505 అనే నంబరులో సంప్రదించాలన్నారు.
ఎస్సీల వర్గీకరణ పేరుతో
రిజర్వేషన్లు ఎత్తి వేసే కుట్ర
ఒంగోలు వన్‌టౌన్: ఎస్సీల వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లను ఎత్తి వేసే కుట్ర చేస్తున్నారని మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ అశోక్ పేర్కొన్నారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో శనివారం మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ ఎస్సీల ఉప వర్గీకరణ, క్రీమిలేయర్‌కు వ్యతిరేకంగా మాలల మహాగర్జన పేరుతో కందుకూరులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మాల నాయకులు పాల్గొంటారన్నారు. సమావేశంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ శ్రీరాములు, వై మల్లిఖార్జునరావు, డీ నరసింహం, పీ రామారావు, ఎం శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ సిబ్బంది బదిలీల్లో
అవినీతిపై విచారణ
ఒంగోలు వన్‌టౌన్: ఎకై ్సజ్ శాఖలో ఇటీవల జరిగిన సిబ్బంది బదిలీల్లో అవినీతిపై శనివారం డీఆర్‌ఓ బీసీహెచ్ ఓబులేషు విచారణ నిర్వహించారు. మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే సుజన్ మాదిగ ఎకై ్సజ్ శాఖలో బదిలీల్లో అవినీతి, లిక్కర్ అమ్మకాలలో రూ.2 కోట్ల మేర నిధులు గోల్‌మాల్ అవడం తదితర అంశాలపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదు పై డీఆర్‌ఓను విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు. ఈ విచారణలో ఎకై ్సజ్ ఈఎస్ ఖాజావుద్దీన్ తనకు బుధవారం వరకూ సమయం ఇవ్వాలని పూర్తి వివరాలను సమర్పిస్తామని కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈ విచారణలో ఫిర్యాదు దారులు కే సుజన్ మాదిగ, ఎం సుధాకర్ మాదిగ, త్యాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
దర్శి: ప్రస్తుతం ఉన్న వరి, కంది, అపరాలు, మిరప పంటల్లో ముందస్తు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు సూచించారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ పీ సంధ్యారాణి అధ్యక్షతన శిక్షణ, సందర్శన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా వ్యవసాయాదికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల అనుసంధానంలో ప్రస్తుత పంటల్లో రైతులకు కావాల్సిన వ్యవసాయ సమాచారం అందించాలన్నారు. డాక్టర్ పీ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులు, సాగులో తీసుకోవాల్సిన అధునాతన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ కంది, వరి, మినుము, మొక్కజొన్న, పొగాకు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జీ రమేష్ మాట్లాడుతూ పంటల్లో తీసుకోవాల్సిన పోషక, ఎరువుల యాజమాన్య, కలుపు నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ మిరప, కూరగాయ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. జిల్లా వనరుల కేంద్రం డీపీడీ రామమోహన్‌రావు మాట్లాడుతూ ఆత్మపథకం తరఫున చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శనల వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో దర్శి పశువైద్యుడు డాక్టర్ బసవయ్య, వివిధ వ్యవసాయ సబ్‌డివిజన్‌ల ఏడీఏలు, వారి వారి వ్యవసాయ సబ్ డివిజన్‌లలో పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, చీడ పీడల సమస్యల గురించి వివరించి శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment