ఆస్తుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
● జెడ్పీ సీఈఓ చిరంజీవి
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఆస్తుల భద్రత, రికార్డుల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి అన్నారు. పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న పరిపాలనాధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ చిరంజీవి మాట్లాడుతూ ఇయర్ మార్క్‌డ్ ఫండ్స్, లోకల్ ఫండ్, అకౌంటెంటెంట్ జనరల్ ఆడిట్ అభ్యంతరాలు, ఎంపీపీ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు, లోకాయుక్త కేసులు, బడ్జెట్ తయారీ సాంవత్సరిక లెక్కలు, యాన్యువల్ అడ్మినిస్ట్రేషవ్ రిపోర్ట్సు జెడ్పీ కార్యాలయానికి పంపేందుకు, పంచాయతీరాజ్ శాఖ ప్రాముఖ్యత అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో సహాయ ఆడిట్ అధికారి కె.రమేష్‌బాబు మాట్లాడుతూ మండలంలో నిల్వ ఉన్న ఆడిట్ అభ్యంతరాలు ఏ విధంగా డ్రాప్ చేసుకునేందుకు విధి విధానాలు, జీఎస్టీ, ఐటీ ప్రభుత్వానికి ఎలా జమచేయాలో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ పి.బాలమ్మ, పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment