మహిళలకు కారు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్: రూడ్ సెట్ ఆధ్వర్యంలో మహిళలకు కారు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రూడ్‌సెట్ సంస్థ డైరక్టర్ శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 7 నుంచి జనవరి 5వ తేదీ వరకు 30 రోజుల పాటు ఒంగోలులోని రూడ్ సెట్ శిక్షణ సంస్థలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9573363141 నంబరుపై సంప్రదించాలన్నారు.
జియోట్యాగింగ్ సర్వే పూర్తి చేయాలి
కొత్తపట్నం: మండలంలో ఎన్‌పీసీఐ, జియోట్యాగింగ్ సర్వే పూర్తి చేయాలని జిల్లా ప్రజా పరిషత్ కార్యనిర్వహణాధికారి బి.చిరంజీవి ఆదేశించారు. బుధవారం కొత్తపట్నం–1 సచివాలయం, గుండమాల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెలాఖరుకు ఇంటింటి సర్వే పూర్తి చేయాలని కోరారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలని, కుటుంబ యజమాని పేరుతో బ్యాంక్ అకౌంట్ లేకుంటే ఓపెన్ చేయించాలని సూచించారు. 17 వేల మందిని యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 వేల మందికి చేయడం జరిగిందన్నారు. మిగతా 5 వేల మంది నమోదును ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గుండమాల గ్రామంలో ఆధార్ సెంటర్‌ను పరిశీలించారు. ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీకృష్ణతో మాట్లాడుతూ ఇవన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment