ఎక్కడి వడ్లు అక్కడే..
ఇది తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డికి చెందిన వడ్లు. వరి కోసి వారమైంది. వడ్లను ఆరబెట్టారు. తూకం వేసేందుకు సిద్ధం చేశారు. కానీ శుక్రవారం ఉదయం అకాల వర్షాలతో ఆరబోసిన వడ్లు తడిశాయి. కొన్ని వడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ఆరు నెలల శ్రమఫలాన్ని దక్కించుకునేందుకు రైతు విజయేందర్‌రెడ్డి తన వద్ద పనిచేసే వర్కర్లతో ఇలా నానా తంటాలు పడ్డారు.
తడిసిన వడ్లను చూపుతున్న ఈ దంపతులు ముస్తాబాద్ మండలం పోత్గల్‌కు చెందిన కుంట్ల చందు, పద్మ. పక్షం రోజుల కిందటే వరిపొలాన్ని కోసి వడ్లను సింగిల్‌విండో కేంద్రంలో పోశారు. వడ్లు ఆరాయి. కానీ వారం రోజుల కిందట అకాల వర్షానికి వడ్లు తడిశాయి. ఈ వడ్లను కొనేందుకు అవకాశం లేకపోవడంతో రూ.1900లకే క్వింటాలు చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment