చెట్ల నరికివేతను అడ్డుకున్న అధికారులు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలోని రైతులకు ధాన్యం ఆర బెట్టుకునేందుకు స్థలం లేకపోవడంతో బుధవారం స్థానిక శ్రీవేంకటేశ్వర ఆలయం ఆవరణలోని ఫారెస్టులో చెట్లను నరికివేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో ఖలీలొద్దీన్ మాట్లాడుతూ ఫారెస్టును నరికి చదును చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు స్థలం లేకపోతే రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. మళ్లీ చెట్లను నరికివేసేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డిప్యూటీ ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ రాఘవేందర్‌రావు, సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment