బీఆర్‌ఎస్‌తోనే తప్పిన విద్యుత్ భారం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ భారం పడకుండా నిలువరించడంలో బీఆర్‌ఎస్ విజయం సాధించిందని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలో బుధవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. విద్యుత్ సమస్యలపై కేటీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్‌తోనే ప్రజలపై భారం పడకుండా ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుందన్నారు. పవర్‌లూమ్స్‌కు విద్యుత్ సబ్సిడీని 10 హెచ్‌పీల నుంచి 25 హెచ్‌పీలకు పెంచడం కూడా కేటీఆర్ చలువేనన్నారు. బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment