వ్యాపారులు నిబంధనలు పాటించాలి
● సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
సిరిసిల్ల: టపాసుల వ్యాపారులు నిబంధనలు పాటించాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూ చించారు. జిల్లా కేంద్రంలోని మానేరువాగు తీరంలో బతుకమ్మ ఘాట్ పక్కన ఏర్పాటు చేసిన టపాసుల షాపులను బుధవారం సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణతో కలిసి పరిశీలించారు. టపాసుల దుకాణాల వద్ద నీళ్ల డ్రమ్ములు, ఇసుక బకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. దుకాణాల మధ్య వాహనాలు నిలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను బయటే నిలపాలన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు దుకాణాల వద్ద ఉండొద్దని సూచించారు. ని బంధనలు ఉల్లంఘిస్తే తాత్కాలిక లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment